YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరెంట్ కష్టాలు...

ఏపీలో కరెంట్ కష్టాలు...

ఏపీలో కరెంట్ కష్టాలు...
విజయవాడ, 
ఏపీని విద్యుత్ కోతలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.. కరెంట్ కష్టాల నుంచి బయటపడేందుకు చర్యలు ప్రారంభించింది. ఇటు నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకూ ఇతర రాష్ట్రాల నుంచి అప్పుగా కరెంటును తీసుకున్నారు. అలాగే జూన్ నుంచి అప్పు తీరుస్తున్నారు.. అది కూడా సెప్టెంబరు 30తో పూర్తవుతుందట. ఆ తర్వాత పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది.ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు 57శాతానికి పైగా తగ్గిన సరఫరానిలిచిపోయిందంటున్నారు అధికారులు. సమ్మెలు, భారీ వర్షాలతో మహానది బొగ్గు గనుల నుంచి సరఫరా పడిపోయిందని.. సింగరేణిలో కూడా వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటున్నారు. ఇటు డొంకరాయి–దిగువ సీలేరులో ఆగస్టులో పవర్ కెనాల్‌కు గండి పడింది. ఈ పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలతో ఆటంకం ఏర్పడింది.రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు.. బొగ్గు సరఫరా కోసం మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్), సింగరేణి ( ఎస్సీసీఎల్) సంస్థలతో థర్మల్ కేంద్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఏడాదికి 17.968 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎంసీఎల్ సరఫరా చేయాల్సి ఉండగా.. సింగరేణి నుంచి 8.88 మిలియన్ మెట్రిక్ టన్నులు సరఫరాచేయాల్సి ఉంది.భరత్పూర్‌లోని ఎంసీఎల్లో జూలై చివరి వారంలో ప్రమాదం జరిగింది. తర్వాత కార్మికులు 15 రోజులు సమ్మె చేయడంతో.. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు రావాల్సిన బొగ్గు సరఫరాలో భారీగా కోత పడింది. మళ్లీ సెప్టెంబరు మూడోవారంలో ఎంసీఎల్లో మూడు రోజులు, సింగరేణిలో ఒకరోజు సమ్మె పాటించడంతో బొగ్గు థర్మల్ కేంద్రాలకు అందలేదు. బేస్లోడ్ పవర్ అందిస్తున్న థర్మల్ కేంద్రాల ఉత్పత్తిని ఈ పరిణామాలు దెబ్బతీశాయంటోంది ప్రభుత్వం.ఇటు డొంకరాయి, దిగువసీలేరు మధ్య విద్యుత్ ఉత్పాదన కోసం ఉద్దేశించిన పవర్ కెనాల్‌కు ఆగస్టు 12న భారీ వరదతో గండి పడింది. దీన్ని పునరుద్ధరించడానికి పనులు సాగుతున్నా.. వర్షాలతో పనులు ముందుకు నడవడం లేదు. దీంతో 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ పనులను పూర్తి చేయడానికి ఏపీ జెన్కో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం తెలిపింది.మహానది కోల్ ఫీల్డ్‌లో, సింగరేణిలో సెప్టెంబర్‌లో వర్షాలు పడటంతో.. ఏపీ జెన్‌కోకు అందాల్సిన బొగ్గు సరఫరా సక్రమంగా జరగడం లేదట. జెన్ థర్మల్ సంస్థల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ( పీఎల్ఎఫ్) 85శాతానికి చేరుకోవాలంటే.. దాదాపు 70,000 మెట్రిక్ టన్నుల బొగ్గు కావాల్సి ఉంటే.. ప్రస్తుతం 45,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే ఎంసీఎల్, సింగరేణి సంస్థలనుంచి అందుతోంది. బొగ్గు కొరతను తీర్చేందుకు, సరఫరాను పునరుద్ధరించడానికి ఏపీ జెన్కో అధికారులు మహానది, సింగరేణి సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు.ఇటు సింగరేణి నుంచి సరఫరాను రోజుకు 4 ర్యాక్స్ నుంచి 9 ర్యాక్స్‌కు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తిచేశారు. అలాగే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏపీ సీఎం లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం సరిపడా బొగ్గును సరఫరాచేయాలంటూ, బొగ్గు సరఫరాను పెంచడానికి ప్రత్యామ్నాయం చూడాలని కోరారు. ఇటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్రంలో సంబంధిత శాఖలతో సంప్రదింపులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Related Posts