YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వివేక హత్య జరిగి 200 రోజులు

వివేక హత్య జరిగి 200 రోజులు

వివేక హత్య జరిగి 200 రోజులు
కడప, 
సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వివేకానందరెడ్డి హత్య జరిగి 200 రోజలైనా ఈ కేసు చిక్కుముడి వీడలేదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కేసును ఎందుకు ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వం కేసును నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.వివేకా హత్యకేసులో అసలు నిందితుల్ని రక్షించడానికి అమాయకుల్ని ఆత్మహత్య చేసుకునేలా పోలీసులతో వేధిస్తున్నారని ఆలపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఒత్తిడితో శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని.. ఆత్మహత్యకు ముందు ఆయన రాసినట్టుగా భావిస్తున్న రెండు సూసైడ్‌ నోట్లలో చేతి రాతలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఒక లేఖ శ్రీనివాస్‌రెడ్డి రాసినా.. మరో చేతిరాత ఎవరిదన్నది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు డీజీపీ స్వయంగా రంగంలోకి దిగినా.. కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలన్నారు మాజీ మంత్రి.ఈ హత్య జరిగిన తర్వాత హడావిడి చేసిన వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి.. వైఎస్సార్‌సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు రాజేంద్ర ప్రసాద్. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా తన సోదరుడు జగన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సొంత బాబాయిని చంపిన వారిని పట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. శాంతిభద్రతల్ని జగన్ గాలికి వదిలేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూస్తే.. జగన్ మాత్రం రాష్ట్రాన్ని అంధకారంగా మారుస్తున్నారని ఫైరయ్యారు.

Related Posts