Highlights
- భూమి విలువలు 70% వరకు పడిపోయే ప్రమాదం..?
- వచ్చే 2 -3 ఏళ్ళల్లో ఊహించని పరిణామాలు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఏమి జరగబోతోందోనన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు దాపురించనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్ లో భూముల ధరలు పెరగడానికి ముఖ్య కారణాలు అంతా పెద్ద మాయని అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి భూముల ధరలు పెరిగియానుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రవాసాంధ్రులు విపరీతంగా పెట్టుబడి పెట్టారనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఐటీ కంపెనీలు రావటం వలన పెరిగాయనడం శుధ్ధపొరపాటు అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
హైదరాబాద్ చుట్టూ భూములు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం లో ఎందుకు పెరిగియానుకుంటున్నారు.కొన్ని వేల ఎకరాలు కొంతమంది పారిశ్రామిక వేత్తలు ట్రస్ట్ పేరుతో కొన్నారు. కొన్ని వేల ప్లాట్ లు, వెంచర్లలో లంచం భారీగా దండుకున్న గవర్నమెంట్ అధికారులు,బల్క్ బుకింగ్ చేసి బినామీ పేర్లతో కొన్నారు. రాజకీయ నాయకులు బినామీలను పెట్టి కొన్ని వేల ఎకరాలు అడ్వాన్స్ గా కొని అక్కడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయించుకున్నారు.(గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్, ఆదిభట్ల, ఔటర్ రింగ్ రోడ్).ఈ ప్రాంతాలకు ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఈ ప్రాంతాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో విపరీతంగా డిమాండ్ పెంచేశారు. ఇదే అదనుగా ఊహకు అందనంతగా.. అడ్డు అదుపు లేకుండా ధరలు పెంచేశారు . దానికి ఇష్టం వచ్చినట్లు ఆర్టిఫిషల్ డిమాండ్ ను కూడా జోడించారు. ఇందుకు లక్షల రూపాయల జీతాలున్న ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేశారు. వారినిధరలు పెరుగుతాయని మభ్యపెట్టి, ప్రెస్టీజ్ వలయంలోకి నెట్టి, పీకలలోతు రుణాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు.
నెలకు ఇరవై వేలలో బ్రతికే వారు ఈ ఏరియా లలోనెలకు లక్ష రూపాయలైన సరిపోని వింత ప్రపంచాన్ని సృష్టించారు.
బయటకు చెప్పుకోలేక,నెలకు లక్ష జీతం వచ్చినా సరిపోక విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అంతేకాకుండా..
హైదరాబాద్ చుట్టూ వస్తున్న డిమాండ్ చూసి సామాన్య ప్రజలు తమ ఊళ్ళలోని వ్యవసాయ భూములను అమ్మి ఇక్కడ ప్లాట్ లు కొన్నారు(ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు భారీగా కొన్నారు).
రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ రిజిస్ట్రేషన్ ఖర్చులను పెంచడంతో పాటుగా కనీస భూముల ధరను కూడా పెంచేసింది. ఫలితంగా ఈ ఏరియాలలో కోటి రూపాయలకు విలువ లేకుండా పోయింది. అదే నిజమనుకొని...అప్పుల ఊబి లో కూరుకుపోయి..లోన్ ల వలయంలో చిక్కుకుపోయిన లక్షలాది మంది అమాయకులకు వ్యక్తిగత జీవితమే లేకుండా పోయిందని చెప్పాలి. చివరికి పిల్లల జీవితాలను కూడా ఆయాలకు, క్రష్ లకు ఒదిలేశారు.ఫాస్ట్ ఫుడ్, హోటల్ తిండిలకు అలవాటు బానిసలుగా మారి పరిగెడుతూ... పరిగెడుతూ...మాయా ప్రపంచంలో భాగమయ్యారు.అందరూ ఈ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.ఇదే భారీ ప్రమాదంతెలుసుకోలేకపోతున్నారు. ఇది వాపు మాత్రమే... బలుపు ఎంతమాత్రం కాదు.
రాబోయే రోజుల్లో ఒక ఘటన జరగబోతోంది.అది ఏమిటంటే..భూములను ఆధార్ తో లింక్ చేయడం. ఈ ఒక్క దెబ్బతో భూముల రూపంలో ఉన్న బ్లాక్ మనీ వైట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే భారీగా భూములు ఉన్నవారు ఎక్కడిక్కడ భూములు తెగనమ్ముతారు. బినామీల పేరున ఉన్న భూములు మొత్తం ట్రాన్స్ఫర్ కి పెడతారు