YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ లో కమిటీల ఏర్పాటుకు టీడీపీ ప్లాన్

నవంబర్ లో కమిటీల ఏర్పాటుకు టీడీపీ ప్లాన్

నవంబర్ లో కమిటీల ఏర్పాటుకు టీడీపీ ప్లాన్
విజయవాడ, 
ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులను సిద్ధంగా ఉంచేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం బ్యాలట్ పద్ధతిలో కమిటీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. కమిటీ నేతలు సక్రమంగా పనిచేయకుంటే కార్యకర్తలు ఆ నేతలను రీకాల్ చేసే అవకాశాన్ని కూడా కొత్తగా కల్పిస్తున్నారు. దీంతో నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఉన్న జిల్లా కమిటీలు కూడా సక్రమంగా పనిచేయడం లేదని చంద్రబాబు గుర్తించారు. క్యాడర్ పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ నేతలు మాత్రం దూరంగా ఉండటాన్ని పసిగట్టిన చంద్రబాబు టీడీపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో లీడర్ లేకుంటే క్యాడర్ సక్రమంగా పనిచేయదని భావించిన చంద్రబాబు నవంబరు నెలలోగా కమిటీల నియామకం చేపట్టాలని నిర్ణయించారు.జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుండటంతో పార్లమెంటరీ కమిటీలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల ఎంపిక కోసం ముందుగా సంస్థాగత ఎన్నికల కమిటీని చంద్రబాబు నియమించనున్నార. ఈకమిటీ లో సీనియర్ నేతలు ఉండనున్నారు. దసరా రోజున ఈ కమిటీని ప్రకటించనున్నారు. బ్యాలట్ పద్ధతిలో పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ ఎన్నిక కానుంది. కమిటీల్లో బడుగు, బలహీన వర్గాల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం ఉన్న కమిటీల్లో యాక్టివ్ గా లేని నేతలను పక్కన పెట్టాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించేందుకు కూడా వెనకాడబోనని ఆయన వార్నింగ్ లు పార్టీ నేతలకు పంపారు. ఈ కమిటీల్లో 33 శాతం మహిళలకు, 33 శాతం యువతకు చోటు కల్పించనున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త రక్తాన్ని ఎక్కిస్తే తప్ప పార్టీ పుంజుకోలేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే ఆయన పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించదలచుకున్నారు.

Related Posts