రైతు తగాదాలు లేకుండా భూముల సర్వే
ఏలూరు, సెప్టెంబర్ 30,
రైతులు మధ్య తగాదాలకు ఆస్కారం లేకుండా రైతులకు సంబంధించి భూములు సర్వేలు చేయాలని జాయింట్ కలెక్టర్ .2 నంబూరి తేజ్ భరత్ సర్వే అధికారులను ఆదేశించారు. స్థానిక
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి అర్జీలను స్వీక రించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ
సందర్భంగా భీమవరం పట్టణానికి చెందిన కొప్పర్తి నారాయణ స్వామి వినతిపత్రం ఇస్తూ సరిగుట్టపాడు గ్రామంలో తనకు రి.స నెం .1616లో య .5.00 సెంట్లు, రి.స .నెం .2159/1,2,3
లలొ సుమారు య .1.74 సెంట్లు, రి .స .నెం 2159/4 లో య .2.00 సెంట్ల భూమిన అధికారులు సక్రమంగా సర్వేచేసి కొలవక పోవడంవల్ల సమీప సరిహద్దుగల రైతులతో తగాదాలు
ఏర్పడుతున్నాయని కావున రైతుల మధ్య తగాదాలు లేని విధంగా సర్వే నిర్వహించి రాళ్లువేసి అప్పగించాలని కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ భూముల సర్వే విషయంలో అధికారులు
తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతుల భూములు తూ.తూ.మంత్రంగా సర్వేలు చేసి రైతులమధ్య తగాధాలు వచ్చేలా ప్రవర్తించవద్దని అధికారులకు సూచించారు. రైతుల సమక్షంలో
సక్రమంగా సర్వేచేసి సరిహద్దురాళ్లు వేసి రైతులకు అప్పగించాలని ఆదేశించారు.
కొవ్వూరుపాడుకు చెందిన టి .వెంకటరత్నం పిర్యాదుచేస్తూ గ్రామంలోని హరిజనపేటకు ఆనుకుని వున్న పుంతరోడ్దును బి.సాహెబ్ చిట్టిబాబు,బి .వెంకట్, ఎన్ మణమ్మ మరికొందరు
ఆక్రమించుని ఇళ్లు నిర్మీంచుకున్నారని దానివల్ల ప్రజలు,రైతులు, విద్యార్థులు రాకపోకలకు అవకాశంలేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కుకునూరు మండలం వింజరం పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిని తోట సీతమ్మ వినతిపత్రం సమర్పిస్తూ సర్వే నెం .90 లో తనకు వున్న య. 1.06 సెంట్లభూమిని అధికారులు
పోలవరం నోటిఫికేషన్ లో తీసుకున్నారని, నాభూమి చుట్టుప్రక్కలవారికి పరిహారం అందించారని కాని తనకు ఇంతవరకు పరిహారం అందలేదని కావున తనభూమికి పరిహారం అందించి
ఆదుకోవాలని కోరారు.
జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామస్థులు మెడియం దుర్గమ్మ, కె మణి, ఎం వాసంతి, బి .లక్ష్మి, కోన గంగమ్మ మరికొంతమంది మహిళలు వినతిపత్రం సమర్పిస్తూ
రాచన్నగూడెం మెయిన్ రోడ్ లోని ఎస్టి పేట, వైఎస్ఆర్ కాలనీకి చేర్చి ప్రభుత్వ ఆసుపత్రికి ముందు గత 3 సంవత్సరాలుగా బ్రాంచిషాపు నిర్వహిస్తున్నారని, దానివల్ల ప్రజలకు ముఖ్యంగా
మహిళలకు ఎంతో ఇబ్బందికరంగా వుందని చెప్పారు.రాత్రి సమయాలలో మందుబాబులు రోడ్లపై సీసాలు పగులగొట్టడం, సీసాలు ఇళ్లపైకి విసరడం, రోడ్దునవెళ్లే మహిళలపట్ల
అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్బాషలాడుతున్నారని, బ్రాంటిషాపును తొలగించాలని కోరారు.
కామవరపుకోట మండలం పోతూరు గ్రామానికి చెందిన కొలుకులూరి బాలషౌరి వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో తనకు వున్న డిఫారం పట్టాభూమిలోనికి వెళ్లకుండా కె .రాములు,
యడ్లపల్లి రఫాయేలు, కంకిపాటి బుచ్చయ్య తదితరులు బెదిరిస్తున్నారని, మారణాయుదాలతో చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ అధికారులు సదరు అర్జీలను స్వయంగా పరిశీలించి న్యాయం జరిగే నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో డిఆర్ ఒ ప్రభాకరరావు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.