YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమ పథకాలను అందేలా చూడాలి

సంక్షేమ పథకాలను అందేలా చూడాలి

సంక్షేమ పథకాలను అందేలా చూడాలి
అనంతపురం సెప్టెంబర్ 30,రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఇదే మొదటిసారని - ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన అభ్యర్థులకు సోమవారం నాడు  అనంతపురం అంబేద్కర్ భవన్ లో నియామక పత్రాల జారీ  కార్యక్రమలో అయన పాల్గోన్నారు.  ఈ కార్యక్రమంలో  మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి,  ఉషాశ్రీ చరణ్,  ఎంపీ రంగయ్య, ఎంఎల్సీ గోపాల్ రెడ్డి, జేసీ, ఇతర అధికారులు పాల్గోన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షునిగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ. ముందుగా గ్రామ,వార్డు ఉద్యోగార్హత సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఒకేసారి ఇన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఇదే మొదటిసారన్నారు. ప్రతి పక్ష పార్టీ నాయకులు పేపర్ లీకేజ్ జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ఉద్యోగాల నియమకాలలు ఏవిధంగా చేశారో వాటిని ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా బహిరంగంగా తెలపాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.  ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరూ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కుల,మత,పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.

<

Related Posts