బాసరలో నవరాత్రి ఉత్సవాలు
బాసర సెప్టెంబర్ 30,నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కోనసాగుతున్నాయి... ఉదయం నాలుగు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవలతో సరస్వతి, లక్ష్మి , మహాకాళి అమ్మవార్లకు మహాభిషేకం , అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు....”తేలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి ఉదయం నుండే క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.... నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేండవ రోజైన నేడు బ్రహ్మ చారిణి అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు స్థానిక పోలీసులు అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..</