సహకార సంఘాల్లో దోచేస్తున్నారు
వరంగల్, సెప్టెంబర్ 30,మానుకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు 70 లక్షల రూపాయల పంట రుణాలలో దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విలేజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మానుకోట పీఏసీఎస్ కార్యాలయంతో పాటు డీసీఓ, డీసీసీబీ బ్యాంక్‌కు వెళ్లి ఆ విషయంపై ఆరా తీశారు. దీంతో వారం రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 18 గ్రామాలు ఉన్నాయి. దానిలో సుమారు 13000 మంది సభ్యులు ఉన్నారు. వారిలో కేవలం 1545 మంది చిన్న, సన్నకారు రైతులు మాత్రమే రుణాలు తీసుకున్నారు. వారికి లక్షలోపు రుణాలు మాత్రమే ఇవ్వడం వల్ల రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. 2012లో నాలుగు కోట్లు, 2014లో 7 కోట్లు ఆ తర్వాత 2019 వరకు కేవలం 6 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని కార్యాలయం సిబ్బంది తెలిపారు.పీఏసీఎస్‌లో రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, వన్‌బీ, పహానీ వాటి జిరాక్స్‌లతో పాటు ఒరిజినల్ పరిశీలిస్తారు. అనంతరం ఆ రైతుల రుణాల విషయంపై పరిశీలించి దానిని బట్టి క్రెడిట్ లిమిట్ ప్రకారం రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు 10వేల నుంచి 20,000 వరకు ఇచ్చిన రైతులే ఎక్కువగా ఉన్నారు. 50,000లోపు రుణాలు ఇచ్చిన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ రుణం కోసం ఇతర బ్యాంకులలో తీసుకున్నారు. డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌లో సుమారు 6 కోట్లు రుణాల వరకు రైతులు సుకున్నారని రుణమాఫీ జరిగినప్పుడు దాని ప్రకారం కొత్త రుణాలు ఇచ్చారు. సొసైటీ నుంచి పేర్లు పంపితే బ్యాంక్ సూపర్‌వైజర్, మేనేజర్ వెరిఫికేషన్ చేసి వారి ఖాతాలో జమ చేయాలి.మానుకోట పీఏసీఎస్ పరిధిలో సుమారు రూ.70 లక్షల రుణాలు దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్ మేనేజర్ అశ్రితను కలిసి ఫిర్యాదుపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా ఆ పనిలో ఉన్నారు. ఆ రెండు కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని డీసీఓ కార్యాలయంనకు కూడా వెళ్లి ఆరా తీçశారు. మానుకోట మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేసినట్లు సమాచారంరూ 70 లక్షల రుణాల డబ్బులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రైతుల పేరుతో రుణాలు కాజేశారా లేదా ఏదైనా నిధులు విషయంలో దుర్వినియోగం చేశారో తేలాల్సి ఉంది. 2012 నుంచి 2019 వరకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల కమీషన్ డబ్బులు రాగా వాటిని వేతనాలుగా తీసుకున్నామని సిబ్బంది చెబుతున్నారు. ఆదే నిబంధన కూడా ఉందని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ సొసైటీ సీఈఓ జియామోద్దీన్‌కు ఉత్తర్వుల లేఖను పంపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు