YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి ఆటలు ఆరోగ్యం తెలంగాణ

రైతుల ఆత్మహత్యల్లో నల్గొండ టాప్

రైతుల ఆత్మహత్యల్లో నల్గొండ టాప్

రైతుల ఆత్మహత్యల్లో నల్గొండ టాప్
నల్గొండ, సెప్టెంబర్ 30,రైతుల ఆత్మహత్యల్లో నల్గొండ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది.  నల్లొండ రైతులు బయట అప్పులు తీసుకుంటున్నారు. అప్పులతో పాటు వడ్డీలు పెరగడంతో  ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.2014 నుంచి ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగాయి. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో చిన్న, కౌలు రైతులే ఎక్కువ ఉన్నట్లు అధికారికంగా తెలిపారు.  నల్గొండలోనే ఈ ఐదేళ్లలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘాలు, రైతు స్వరాజ్య వేదిక సంస్థలు అధ్యయనం చేసి చెబుతుండగా.. అధికారుల సమాచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కూడా ఎఫ్ ఐఆర్  మంది రైతుల్లో 162 మందివి సూసైడ్ గా ధ్రువీకరించగా… ఇప్పటి వరకు 80 మందికి ఒక్కొక్కరికి 6 లక్షల చొప్పున ఇచ్చారు. మరో 82 మందికి నిధులపై ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు నగదు అందలేదు. బ్యాంకుల వల్లే అన్నదాతకు ఇబ్బందులొస్తున్నాయని రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు 

ఇచ్చినా… స్పందించడం లేదని మండిపడుతున్నారు రైతు సంఘాల నేతలు.కాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకులు… జిల్లాల్లో రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. రుణమాఫీపై 

ప్రభుత్వ మార్గదర్శకాలు రాకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వడం లేదు. 31 మండలాల నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ లో 1,907 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

ఖరీఫ్  మొదలై 3 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చింది వెయ్యి కోట్లకంటే తక్కువే. అంటే 50 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయి. సూర్యాపేట జిల్లాలో లీడ్  బ్యాంకు ఖరీఫ్  

రుణ ప్రణాళికను ఇప్పుడు విడుదల చేయడాన్ని చూస్తే… రైతులపై బ్యాంకర్లకి ఉన్న శ్రద్ధ ఏంటో అర్థమవుతుంది. యాదాద్రి జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది.అన్నదాతలు సాగు 

ఖర్చులు, ఎరువులు, విత్తనాల కోసం ఎక్కువ మిత్తికి అప్పులు చేస్తున్నారు. మరోవైపు పంట పెట్టుబడి పథకం కింద ప్రభుత్వం పంటకు ఎకరానికి 5 వేలు ఇస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం 6 

వేలు ఇస్తోంది. అయినా రైతు సాగుకు ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. రాష్ట్ర సర్కారు కౌలు రైతుకు ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  

రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు 60 వేల మంది వరకు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో వీరికి గుర్తింపు కార్డులివ్వగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాల నుంచి 

ఎలాంటి రాయితీలు అందట్లేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో కరవు వస్తుండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల్లో 35 నుంచి 48 మధ్య 

వయసు ఉన్న వారేనని నివేదిక చెబుతోంది. ఈ కష్టకాలంలో రైతు కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగాలు బాసటగా నిలవాలి. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు త్వరగా 

పరిహారం అందించడంతో పాటు ఆత్మహత్యల నివారణకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి.ఏదైనా నష్టం జరిగినప్పుడు కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందట్లేదు. 

పంటల బీమా కూడా శాస్త్రీయంగా లేదు. కౌలు రైతుల రక్షణకు 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ఉన్నప్పటికీ అది ఇప్పటికీ అమలు కాలేదు. దాంతో రైతులకు తీరని అన్యాయం 

జరుగుతోంది.

Related Posts