YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక 'ఆధార్' లింక్ లేనట్టే..?

Highlights

  • తత్కాల్ పాస్ పోర్టుకి ఆధార్‌తో పనిలేదు
  • మధ్యంతర తీర్పు చెల్లుబాటు..
  • తుది తీర్పు ఇచ్చేంత వరకు చెల్లుబాటు
  • మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సుప్రీంకోర్టు
ఇక 'ఆధార్' లింక్ లేనట్టే..?

దేశవ్యాప్తంగా గత డిసెంబరు 15న ఆధార్ లింకింగ్ తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిన సుప్రీంకోర్టు తాజాగా నిరవధికంగా పొడిగించింది.బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో 'ఆధార్' అనుసంధానానికి ఈ నెలాఖరుతో తుది గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో  సబ్సిడీ ఇవ్వడానికి తప్ప మిగిలిన వాటికి ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని డిమాండ్ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మధ్యంతర తీర్పు ఆధార్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును వెలువరిచేంత వరకు అమల్లో ఉంటుందని బెంచ్ తెలిపింది. "చివరికి తత్కాల్ పాస్‌పోర్టు జారీకి కూడా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరిగా కోరరాదు" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 

Related Posts