గాంధీ జయంతికి ఏర్పాట్లు
వరంగల్ అర్బన్, సెప్టెంబర్ 30,:
అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ గార్డెన్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి వేడుకలకు ఏర్పాటు చేయాలని మున్సిపల్, రెవెన్యూ సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 1న ఉదయం 11.00 గంటలకు వరంగల్ అర్బన్ జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ పెన్షన ర్స్ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.