YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సోలార్ విద్యుత్ పై వార్తలు అవాస్తవం

 సోలార్ విద్యుత్ పై వార్తలు అవాస్తవం

విండ్, సోలార్ విద్యుత్ పై వార్తలు అవాస్తవం
విజయవాడ సెప్టెంబర్ 30,:
విండ్, సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. వాతావరణ మార్పులు కారణంగా గడచిన 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుత్పత్తి సరిగ్గాలేదని  విద్యుత్ 

శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. పీక్ అవర్స్ లో  విద్యుత్ జెనరేట్ కావడంలేదు. గడచిన 10 రోజుల్లో 3వేల మెగావాట్ల సౌర విద్యుత్ 

గాను ఒకరోజు మాత్రమే కొద్దిసేపు గరిష్టంగా 815 మెగావాట్లు వచ్చింది. కనిష్టంగా 28 మెగావాట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.  గత ఏడాదితో పోలిస్తే అధికంగానే బొగ్గును 

నిల్వచేసుకున్నాం. 2018  సెప్టెంబరు 30న జెన్కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు, 2019 సెప్టెంబరు 30న బొగ్గు నిల్వలు 46,486 మెట్రిక్ 

టన్నులు వున్నాయి. ముందుస్తుగా ప్లాన్ చేసుకోవడంవల్లే దాదాపు 16వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఉండేలా చూసుకున్నాం. ఇందువల్లే 2018 జూన్, జులై, ఆగస్టు నెలలతో 

పోలిస్తే.. ఈఏడాది ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తిచేశాం. బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాల సమయంలో ఈ అదనపు నిల్వలు కొంతమేర ఊరటనిచ్చాయి: కేఎస్కే థర్మల్ కేంద్రానికి 

రూ.120 కోట్లు చెల్లింపులు పూర్తిచేశామని అన్నారు. విద్యుత్ ఎక్స్చేంజి నుంచి ఇవ్వాళ్టి నుంచి విద్యుత్  కొనుగోలు చేస్తున్నాం. వచ్చే 7 రోజులపాటు రోజుకు 8 ర్యాక్ల చొప్పున సింగరేణి 

నుంచి బొగ్గు వస్తోందని అన్నారు. 

Related Posts