శ్రీవారి వైభవాన్ని మరింత విస్తృతంగా భక్తులకు అందించండి
- టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.
తిరుమల సెప్టెంబర్ 30,:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విస్తృతంగా చేరవేయాలని మీడియా ప్రతినిధులను టిటిడి ఛైర్మెన్ వైవి
సుబ్బారెడ్డి కోరారు. తిరుమలలోని రాంభగీచా - 2 విశ్రాంతి గృహంలో టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి మీడియా సెంటర్ ను సోమవారం ఉదయం టిటిడి ఛైర్మెన్
ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విరివిగా
అందించాలని కోరారు. శ్రీవారి వాహనసేవలు, నిత్యకైంకర్యాలు, తిరుమలతోపాటు తిరుపతిలోని పలు వేదికలపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాచారానికి సంబంధించిన
ప్రత్యేక కథనాలు, పత్రికా ప్రకటనలు, ఫోటోలను అందిస్తారన్నారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ప్రతిరోజు మీడియా సెంటర్ లో అధికారులు తెలియజేస్తారన్నారు. మీడియా
ప్రతినిధుల సౌలభ్యం కోసం మీడియా సెంటర్ లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫ్యాక్స్, టివి, పత్రికలు, టెలిఫోన్ వసతి కల్పించామన్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహనసేవలను
ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు కె.శివకుమార్, ఎం. రాములు, సివిఎస్వో గోపినాథ్ శెట్టి, సిఈ రామచంద్రారెడ్డి, అదనపు
సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజీవో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.