ఆర్టీసీ సిబ్బంది నిరాహార దీక్షలు
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 30,:
పాలమూర్ లో ఆర్టీసీ జాయింట్ ఆక్షన్ కమిటీ సామూహిక నిరాహార దీక్షలు మొదలు పెట్టింది. 2017 లో జీతాలు పెంచుతాం అని చెప్పి ఇప్పటివరకు అది అమలు చేయలేదు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తాను అని చెప్పిన కెసిఆర్ ఇపుడు ఎందుకు మాట మారుస్తున్నారని కార్మిక నేతలు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పోరాటం లో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన పోరాటం చాల కీలకమైనది. ఎవరైనా ఉద్యమం చేస్తాం అంటే వారిని బెదిరించడం చేస్తున్న ప్రభుత్వం 20 వేల రూపాయి జీతముతో ఉద్యోగ భద్రత లేకుండా ఎలా బతుకుతారు. అసలు ఒక కుటుంబాన్ని పోషించు కుంటూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 4000 రూపాయలు పెన్షన్ తో పడే కష్టాలు ఎన్నో అని వారన్నారు.