YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిజాయతిగా సేవలు చేయండి

నిజాయతిగా సేవలు చేయండి

నిజాయతిగా సేవలు చేయండి
కర్నూలు 
సోమవారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయం లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, 
తోగూరు ఆర్థర్, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.ఫాజెసి రవి పట్టన్ శెట్టి, జడ్పీ సీఈఓ పుల్లారెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు తదితరులు హజరయ్యారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లా లో పండుగ వాతావరణం లో ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేస్తున్నాం. 
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున లక్షల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను ఎటువంటి సమస్య లేకుండా, పారదర్శకంగా రికార్డు టైంలో పూర్తి చేశారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో కర్నూలు జిల్లా ఫస్ట్..ఈ రోజు వరకు 5500ల మందికి అప్పాయింట్మెంట్ లెటర్స్ 
జనరేట్ చేసి ఈ రోజు 4837 మంది కి ఉద్యోగ పత్రాల జారీ.. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలని అన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు ఎటువంటి సిఫార్సులు చేయకుండా ..జిల్లా యంత్రాంగం పై ఏ ఒత్తిడి తీసుకురాకుండా ..పారదర్శకంగా సచివాలయ నియామకాలకు సహకరించిన జిల్లా ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలని అన్నారు. 
జిల్లాలో 9597 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక కోసం డి ఎస్ సి ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గా నా ఆధ్వర్యంలో జెసి, ఎస్పీ, జడ్పీ సీఈఓ, డిపిఓ, అందరూ రెండున్నర నెలలుగా దాదాపు 15000 ల మంది అధికారులు, ఉద్యోగులు నిరంతరం కృషి చేసి జిల్లాలో సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎటువంటి సమస్య లేకుండా, పగడ్బందీగా, పారదర్శకంగా 
పూర్తి చేసి నియామక పత్రాల జారీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని కలెక్టర్ అన్నారు. సీఎం ఆదేశాలు, ఆశయం మేరకు నూతనంగా నియామకం అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా ఉంటూ చిరునవ్వుతో..ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలను ప్రజల గుమ్మం ముందు చేర్చండని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను, పథకాలను లబ్ధిదారుల ఇంటివద్ద కే అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురండి..జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలబెట్టండని సూచించారు. కర్నూలు ఎమ్మెల్యే, సభాధ్యక్షులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ చాలా మందికి ఉన్న అవకతవకల అనుమానాలను పటాపంచలు చేస్తూ ..సీఎం ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఎటువంటి సిఫార్సు లేకుండా ..మెరిట్ తో..నిజాయితీగా.. పారదర్శకంగా.. సచివాలయ ఉద్యోగుల 
నియామకాలు.. అధికారులకు అభినందనలని అన్నారు. నిజాయతీగా ప్రజలకు సేవ చేసి సీఎం గారికి, ప్రభుత్వం కు మంచి పేరు తీసుకురండని అన్నారు. పాణ్యం ఎమ్మల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మెరిట్ పై గ్రామ , వార్డ్ సచివాలయ ఉద్యోగుల పరీక్షలను నిర్వహించి ..పారదర్శకంగా..ఎటువంటి రేకమెండేషన్ లేకుండా నియామకాలను 
చేపట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్, జెసి, ఎస్పీ లకు అభినందనలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకు గ్రామాల్లో, వార్డుల్లో నవరత్నాల పథకాల రథ సారథులై ..నిజాయితీ గా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి ప్రభుత్వం కు మంచి పేరు తీసుకురండని అన్నారు. 
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ రెండు నెలల్లో పారదర్శకంగా లక్షల ఉద్యోగాల నియామకాలను పూర్తిచేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అభినందనలు...భారత దేశంలో ఇది ఒక చరిత్ర. నీతి, నిజాయితీ తో కంకణబద్ధులై ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించండని సూచించారు.కర్నూలు ఎంపీ డా. సంజీవ కుమార్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ పాలకులు చేయని ఒక విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుని..అతి 
తక్కువ వ్యవధిలో ..నిజాయతీగా.. లక్షల సచివాలయ ఉద్యోగుల నియామకాలను పూర్తి చేయడం..ఒక చరిత్ర. సీఎం కు, జిల్లా యంత్రాంగం కు, సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు అభినందనలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు నిజాయతీగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించి ప్రభుత్వం కు మంచి పేరు తీసుకురండని అన్నారు. 

Related Posts