YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మురుగు కాలువల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు

మురుగు కాలువల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు

మురుగు కాలువల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు
వనపర్తి 
మండల కేంద్రమైన గోపాల్ పేట లోని ఈదమ్మ గడ్డ, చిన్న వడ్డే గేరి ప్రాంతాలలో మూడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మాణం అవుతున్న మురుగు కాలువ నిర్మాణ పనులకు మండల నాయకులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంధ్యా తిరుపతి యాదవ్, జెడ్ పి టి సి భార్గవికోటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ 
గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగానే ఈ మురుగు కాలువల నిర్మాణమ నీ వారన్నారు. ఈ మురుగు కాలువల నిర్మాణం వల్ల వీధులన్నీ శుభ్రంగా ఉండి ప్రజలకు సౌకర్యం కలిగిస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్. ఉప సర్పంచ్ శివ, కో ఆప్షన్ సభ్యులు మతిన్. ఎంపీటీసీ 
కేతమ్మ, వార్డ్ సభ్యులు వెంకన్న శారద, నాయకులు బాలరాజు, శేఖర్, వెంకటస్వామి, బాబు, మన్యం నాయక్, శ్రీనివాసులు, నాగరాజు, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts