YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ముందడుగు (శ్రీకాకుళం) శ్రీకాకుళం,

ముందడుగు (శ్రీకాకుళం) శ్రీకాకుళం,

ముందడుగు (శ్రీకాకుళం)
శ్రీకాకుళం,

నేరడి బ్యారేజి నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడింది. ఒడిశా వైపు ఉన్న భూములను సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వంశధార ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ ముకుందంశర్మ ఆదేశించారు. నివేదిక అందించేందుకు డిసెంబరు నెలాఖరు వరకు గడువు విధించారు. ఒడిశా పరిధిలోని భూములను సర్వే చేసేందుకు అక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుపడుతోంది. ఆ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులకూ సహకరించడం లేదు. ఈ క్రమంలోనే అప్పటి తీర్పుపై ఒడిశా అప్లికేషన్‌ దాఖలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర అందుకు అవసరమైన సమాచారమంతా ఉంది. సర్వే చేయాల్సిన అవసరం లేదు’ అని ఏడాది జులైలో ఒడిశా ప్రభుత్వం అప్లికేషన్‌ వేసింది. దీనిపై ట్రైబ్యునల్‌ తాజా ఆదేశాలు జారీ చేసింది. నేరడి బ్యారేజి నిర్మాణానికి అప్పటి తీర్పులోనే ట్రైబ్యునల్‌ అవసరమైన స్పష్టత ఇచ్చింది. 106 ఎకరాల భూసేకరణ బాధ్యతను ఒడిశా ప్రభుత్వంపైనే పెట్టింది. తీర్పు వెలువడి గెజిట్‌లో ప్రకటించిన తేదీ నుంచి సేకరణకు ఏడాది గడువు విధించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సహా కేంద్ర పర్యావరణ, అటవీ, గిరిజన శాఖల నుంచి నేరడి బ్యారేజి, సైడ్‌వియర్‌ నిర్మాణాలకు అవసరమైన అనుమతులు తెచ్చుకోవాల్సిందిగా షరతు విధించింది. నేరడి బ్యారేజి పూర్తిగా వినియోగంలోకి వచ్చిన తరవాత సైడ్‌వియర్‌ను పూర్తిగా మూసేయాలని కూడా తీర్పులో స్పష్టం చేసింది. దీన్ని బట్టే ‘నేరడి బ్యారేజి’కి ఎంత అనుకూలతను ఇచ్చిందో కూడా స్పష్టమవుతోంది. నేరడి బ్యారేజి నిర్మాణంలో భాగంగా ఒడిశాలో భూభాగానికి సాగునీటిని అందించేందుకు ఎడమ వైపు సాగునీటికి స్లూయిజ్‌ నిర్మించాలని కూడా స్పష్టం చేసింది. ఒడిశాలో అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చుల మొత్తాన్ని భరించాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది.
ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు అప్లికేషన్‌లు దాఖలు చేసిన క్రమంలో గతంలోనే ట్రైబ్యునల్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ ముకుందంశర్మతో పాటు సభ్యులు పర్యటనలో భాగస్వాములయ్యారు. కాట్రగడ్డ, నేరడి, గొట్టా బ్యారేజి ప్రాంతాలతోపాటు ఒడిశా భూభాగాన్ని కూడా సందర్శించి పరిశీలించారు. ఈ క్రమంలో వెలువడిన తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబరు తరవాత సర్వే చేయాల్సిందిగా ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర జలసంఘం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రభుత్వాలు ఈ సర్వే చేయాలని నిర్దేశించింది. సర్వే చేసే సమయంలో అక్కడేమైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతనూ ఒడిశా ప్రభుత్వంపై మోపింది. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు కల్లా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రభుత్వాలు ఈ నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం పెట్టేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీ కావడం నేరడి బ్యారేజి నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

Related Posts