బ్రాండ్ ఇండియాను బలోపేతం చేయాలి
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
ధాని మోదీ ఇవాళ తమిళనాడు వెళ్లారు. అక్కడ ఆయన మద్రాసు ఐఐటీలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. భారత యువకుల సామర్థ్యంలో విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు. భవిష్యత్తు స్వప్నాలను మీ కండ్లల్లో చూస్తున్నానన్నారు. ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి స్నాతకోత్సవంలో మోదీ గుర్తు చేశారు. అక్కడ అంతా న్యూ ఇండియా గురించి చర్చించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత సంతతి ప్రజలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారతీయుల ఘనత అమోఘమన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందని ఆలోచించారని, దాని మీలాగే ఐఐటీల్లో చదివిన సీనియర్లే అంటూ మోదీ తెలిపారు. బ్రాండ్ ఇండియాను మీరంతా విశ్వవ్యాప్తం చేస్తున్నారని ప్రధాని చెప్పారు. యూపీఎస్‌సీ పరీక్షల్లో ఐఐటీ గ్రాడ్యుయేట్లు ర్యాంకులు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని తెలిపారు. భారత దేశాన్ని మీరంతా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చేస్తున్నారన్నారు.కార్పొరేట్ ప్రపంచంలోకి వెళితే, అక్కడంతా ఐఐటీ చదివినవాళ్లే ఉంటున్నారన్నారు. ఉన్నత విద్యతో మీరంతా భారత్‌ను సస్యశ్యామలం చేస్తున్నారని మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్ల దిశగా వెళ్తోందని, మీలాంటి ఆవిష్కర్తలు, టెక్నాలజీ ప్రియులతో అది సాధ్యమేనన్నారు. ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు మోదీ ఓ విజ్ఞాపన చేశారు. మీరెక్కడ పనిచేసినా, మీరెక్కడ జీవించినా.. మాతృభూమికి సేవ చేయాలన్న తపనను వీడవద్దు అని అన్నారు. మీకు విద్య నేర్పిన టీచర్లు, చదివించిన తల్లితండ్రులకు, సపోర్ట్ స్టాఫ్‌కు మీరంతా కరతాళధ్వనులతో మెచ్చుకోవాలన్నారు. తమిళనాడుకు ఓ ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడ కొండలు కదులుతాయని, నదులు నిలిచిపోతాయన్నారు. ఈ రాష్ట్రానికి విశిష్టమైన గుర్తింపు ఉన్నదని, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష ఉన్న రాష్ట్రం అని అన్నారు. అంతేకాదు, భారత్‌లో కొత్త భాషను పుట్టించిన ప్రాంతం కూడా ఇదే అని, ఇక్కడ ఐఐటీ మద్రాస్ లింగో భాష పుట్టినిల్లు ఉన్నదన్నారు