ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి
పెద్దపల్లి, సెప్టెంబర్ 30 :
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం
నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి (48) వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి
వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యచరణను ప్రణాళికాబద్దంగా
నిర్వహించాలని, గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామాభివృద్దికి సంబంధించి అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంగా
వార్షిక ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు తమ లక్ష్యాలను చేరుకోవాలని, అధికారులు ఉద్యోగులు
హరితహారం కార్యక్రమంలో పాల్గోని పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని, మొక్కలను నాటడానికి సంరక్షించడానికి విద్యార్థులు, ప్రజలు ముందుకు రావాలని
పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఎఒ రాజేశ్వర్ రావు, జిల్లా అధికారులు, సంబంధిత
సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.