ప్రజాల ఆరోగ్య లతో చెలగటమాడుతున్న అధికారులు
శుద్ధమైన తాగునీటి సమస్య తిరెంత వరకు పొరాడుతాం
- బీజేపీ రామకృష్ణ
కౌతాళం
ప్రజలా ఆరోగ్యాలతో చెలగతమడుతున్న రని తాగునీటి సమస్య తిరెంత వరకు పోరాడుతామని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చ జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ తెలిపారు. సోమ వారం తహశీల్దార్ కార్యాలయం నందు తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ కు వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ కౌతాళం గ్రామం నందు నీటి సరఫరా సరిగ్గా చేయటం లేదు మరియు శుద్ధి లేకుండా విడుదల చేయటం జరుగుతుంది గత 2 సంవత్సరాలనుండి నీటిని శుద్ధి చేయటం లేదు ఈ నీటిని త్రాగటం వలన ప్రజలు రోగాల భారిన పడుతున్నారని దీనివలన విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. వాంతులు విరేచనాలు అవుతున్నాయని ఈ విషయమై ఈ నెల 11 వ తేదీన డి ఎల్ పి ఓ గారికి విన్నపం సమర్పించడం జరిగింది అని మరియు ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి కూడా తెలియచేయటం జరిగింది అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాబోవు 3 రోజులలో సమస్య పరిష్కరించి మంచి నీటిని సరఫరా చెయ్యాలి అని లేకపోతే భారీఎత్తున్న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం అని బీజేపీ రామకృష్ణ హెచ్చరించారు.అనంతరం చంద్ర శేఖర్ వర్మ, రాజశేఖర్, అర్ డబ్లూ,ఎస్, అధికారి సుమా సమక్షంలో వినతీ పత్రాన్ని సమర్పించారు.వెంటనే తాగునీటి సమస్యలు పరిష్కరించాలనికోరారు. ఈ కార్యక్రమంలో రామాంజినేయులు రామచంద్ర నరేంద్ర ,నబీసాహెబ్ యాంకన్నా, తదితరులు పాల్గొన్నారు