జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం
కర్నూలు,
సోమవారం నాడు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎమ్. దీపికా పాటిల్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు ఫిర్యాదులను ఆమె తీసుకున్నారు. మా పొలాన్ని ఆక్రమించుకోవాలని మా ప్రక్క పొలం వ్యక్తి , అతని మేనకొడల్లు కలిసి నన్ను కొట్టారని శిరువెళ్ళ మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి
ఫిర్యాదు చేశారు.నా భర్త వెంకటేశ్వర రెడ్డి బనగానపల్లె ఫ్యాక్టరీ దగ్గర యాక్సిడెంట్ జరిగి మృతి చెందారు. నా భర్త కు వచ్చే బెనిఫిట్స్ ను నాకు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని బనగానపల్లెకు చెందిన వెంకట విజయ ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి అతని పాస్ బుక్ లో మాకు చెందిన కొంత పొలాన్ని నమోదు చేయించుకున్నాడని చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు
మండలం, కొనేటమ్మ పల్లి గ్రామానికి చెందిన లోకేష్ ఫిర్యాదు చేశారు. రాస్తా విషయంలో కొంతమంది మా కుటుంబాలను దుర్బాషలాడుతున్నారని ఓర్వకల్లు మండలం, తిప్పపల్లె గ్రామం, బిసి కాలనికి చెందిన కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
కర్నూలు, గీతానగర్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న డబ్బుకు అధీక వడ్డీతో డబ్బులు కట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ సంధర్బంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు డి వి రమణ మూర్తి, వెంకట్రామయ్య , వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచ్ సిఐలు వాసుక్రిష్ణ, తబ్రేజ్ , ఎస్బీ ఎస్సై కృష్ణమూర్తి , ఒన్ స్టాప్ సెంటర్ వనజ ఉన్నారు.