YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

సీఎం హోదాలో బ్రహ్మోత్సవాలకు జగన్

సీఎం హోదాలో బ్రహ్మోత్సవాలకు జగన్

సీఎం హోదాలో బ్రహ్మోత్సవాలకు జగన్
తిరుమల, సెప్టెంబర్ 30,
ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న జగన్.. సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరపున కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు అందించారు. వైఎస్ కుటుంబానికి రెండు సార్లు ఈ అరుదైన అవకాశం దక్కింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నామంటున్నారు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. అంతేకాదు తండ్రి, తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి అంటున్నారు. జగన్ కూడా పాదయాత్ర ప్రారంభించే ముందు.. ముగిసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు కూడా వెంకన్న సేవలో పాల్గొన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.సాయంత్రం ధ్వజారోహణ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందువైపు ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని.. మేళతాళాలతో శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం లోపలికి వెళ్లి.. గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందజేస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు

Related Posts