హంద్రి నీవా ప్రాజెక్టు ద్వార చెరువులకు నీరు నింపి నియోజక వర్గ రైతులను ఆదుకోవాలి
పత్తికొండ
హంద్రి నీవా ప్రాజెక్టు నీటితో పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని చెరువులు అన్నింటిని నింపాలని,& పందికోన రిజర్వాయర్ క్రింద ఉన్న ఎడమ కాలువ ను పొడిగించి పూర్తి చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో చేపట్టిన రిలేనిరహారా దీక్షలు సోమవారం నాటికి 17 .వ రోజుకు చేరాయి. ఈ 17.వ రోజు రిలేనిరహారా దీక్షలకు ముఖ్య అతిధులుగా ప్రముఖ వ్యాపారవేత్త పారా విశ్వనాథ్(చిట్టెన్న) వైసిపి జిల్లా ఆదికార ప్రతినిథి శ్రీరంగడు లు దీక్షలను హజరై ప్రారంభించారు రైతు సంఘం నాయకులు బి. సురేంద్ర కుమార్ అధ్యక్షత న జరిగిన ఈ సమావేసంలొ వారు మాట్లడుతూ ఈ పత్తికొండ నియెుజక వర్గంలో ఉన్న రైతు కంటి ముందరే హంద్రి నీవా నీరు కాలువల ద్వార కిందకు నీరు జలజల పారి పొతుఉంటే వారు ఆవేదనతొ దిగులు చెందు తున్నారని వారన్నారు రైతుల భాగుకొసం హంద్రి నీవా ప్రాజెక్టు ద్వార అన్ని చెరువులకు నీరు నింపి రైతులను అప్పుల నుంచి ఆత్మహత్యల నుంచి గట్టు ఎక్కించ గలరని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు దీక్షకు సంఘీ భావం తెలిపిన సంఘల నాయకులు ఎన్ జి ఓ సంఘం, టియండి ఉసేన్, సాయిబాబా, వైసిపి నాయకులు గాంధీ రెడ్డి,యస్ టియు నాయకులు కె, నారాయణ,కె, సత్యనారాయణ,బికెయంయు , జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ,ప్రజా సంఘాల నాయకులు రాజా సాహెబ్,కారన్న, తిమ్మయ్య,పెద్ద ఈరన్న, నెట్టేకంటయ్య, సుంకన్న తదితరులు పాల్గొన్నారు