వృద్ధ తల్లిదండ్రులకు మరింత భరోసా
కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ చర్యలు
జగిత్యాల :
వృద్థ తల్లిదండ్రులపై అమానుషంగా ప్రవర్తించడం, దూషించడం, వదిలివేయడం వంటి కార్యకలాపాలు చేసేవారికి ఆట కట్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ చర్యలు ప్రారంభించింది తెలంగాణ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా డివిజన్, మండల సంఘాల ప్రతినిధులతో సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్థ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నిరాదరణకు గురి చేస్తున్న వారికి కఠిన శిక్షలు విధించాలని సామాజిక న్యాయ, సాధికారిత శాఖ ఈ మేరకు ఈ నెల 27న సోషల్ జస్టిస్ శాఖకు ఇచ్చిన సూచనలను వివరించారు. ప్రస్తుతం వృద్ద తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వారికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూండగా ఈ శిక్ష కాలాన్ని ఆరు నెలల వరకు పెంచాలని సూచించింది.
మెయింటెనెన్స్ ,
వెల్ఫేర్ ఆఫ్ప పేరెంట్స్ అండ్ సినియర్ సిటిజన్ యాక్టు 2007లో సవరణలు చేయనున్న నైపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయానికి సామాజిక న్యాయ శాఖ పంపిన డ్రాఫ్ట్ ను పరిశీలించి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న నైపథ్యంలో చట్టంలో సవరణలకు పీఎంఓ సూచించింది. వృద్థులకు సంరక్షకులు గా ఉండే పిల్లల్లో ,దత్తత తీసుకున్న పిల్లలు ,అల్లుల్లు ,కోడల్లు ,మనమళ్ళ కుటుంబంలోని మైనర్ల నిర్వచనాన్ని కూడా విస్తరించాలని ,వృద్థుల కోసం నెలకు కనీసం పది వేలు ఖర్చు చేయాలనే నిబంధనలు విధించాలని సవరణకు సంబంధించి నట్లు వివరించారు. అక్టోబర్ 1న జరిగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు అలిశెట్టి ఈశ్వరయ్య, జిల్లా నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయి , రాజగోపాలచారి, సింగం గంగాధర్,హన్మాండ్లు , విద్యాసాగర్, కరుణ ,గంగాధర్ ,సైఫోయెద్దిన్ ,ఎండి యాకుబ్ తదితరులు పాల్గొన్నారు