YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వయో వృద్ధులకు అండగా హైదరాబాద్ పోలీసులు

వయో వృద్ధులకు అండగా హైదరాబాద్ పోలీసులు

వయో వృద్ధులకు అండగా హైదరాబాద్ పోలీసులు 
హైదరాబాద్ సెప్టెంబర్ 30
వయో వృద్ధులకు హైదరాబాద్ పోలీసులు అండగా నిలువనున్నారు. వీరి కోసం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఫ్రెండ్లి, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విశ్రాంత ఉద్యోగుల వద్దకు వెళ్లి ..మీ కోసం మేమున్నామంటూ చాటి చెప్పనున్నారు. వారి సమస్యలను తెలుసుకొని, తగిన పరిష్కారం చూపనున్నారు. ఇందుకు నగర పోలీస్ కమిషనరేట్‌లోని క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. విశ్రాంత ఉద్యోగులు చాలా మంది పలు సమస్యలతో సతమతమవుతుంటారు.పిల్లలు సక్రమం గా చూసుకోకపోవడంతో మనో వేదనకు గురయ్యేవారు కొందరు.. అన్ని సక్రమంగా ఉన్నా పిల్లలు దూరంగా ఉం డే వారు మరి కొందరు.. చిన్న చిన్న సమస్యలతో వేరుగా ఉండేవారు ఇంకొందరు.. ఇలా పలువురు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను గుర్తించి సామాజిక సేవలో పోలీసులు కూడా తమ వంతు భాగస్వామ్యం కావాలని చూస్తున్నారు. దీనికి స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దసరా పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మహానగరం నాల్గో స్థానంలో ఉంది. భిన్న సంస్కృతులకు నిలయంగా, ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ మారిపోతున్నది. దీంతో హైదరాబాద్ జనాభా కూడా కోటి మందికిపైకి వెళ్లింది. హైదరాబాద్‌ను సురక్షితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క నేరాల ను కట్టడి చేస్తూ.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడడం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లో భాగంగా జాబ్ కనెక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా స్థానికంగా ఉండే సమస్యలను సేకరించి వాటిని పరిష్కరించేందుకు ఇతర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ టీమ్స్ ను రంగంలోకి దింపి, మహిళల్లో షీ టీమ్స్‌పై పూర్తి అవగాహన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులకు బాసటా నిలిచ్చేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలోని బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. వీరి తరువాత ఆయా సెక్టార్ ఎస్సైలకు కూడా వారం రోజుల పాటు శిక్షణ ఇస్తారు.శిక్షణ పూర్తయిన తరువాత కాలనీ, అపార్టుమెంట్, బస్తీ సంక్షేమ సంఘాల సహకారం తీసుకుంటారు. ఇంటింటికీ తిరిగి వృద్ధుల గురించి ఆరా తీస్తారు. వారి వివరాలు సేకరించడంతో పాటు సమస్యలను తీసుకుంటారు. వారి సమస్యలన్నీ సేకరించిన తరువాత వాటిని పరిష్కంచడంపై దృష్టి సారిస్తారు. ఇందులో కాలనీ సంక్షేమ సంఘాలతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా ఆహ్వానించనున్నారు.ఒంటరిగా ఉండే వృద్ధుల భద్రతపై ప్రధాన దృష్టి సారించనున్నారు. ఇండ్లలో పనిచేసే వారెవరు.. వారి గురించి విచారణ చేస్తారు. ఆ వివరాలను వారికి అందజేయడం తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ విచారణ కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పనిచేయనున్నారు. అంత సమాచారం సేకరించిన తరువాత ఆయా కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పనులు చేయకూడదు.. ఏ పనులు చేయాలనే అంశం పై అందరితో చర్చిస్తారు. వృద్ధుల్లో అవగాహన తీసుకువస్తారు. వారిలో మనో ధైర్యాన్ని నింపుతూ నగర పోలీసులు వారికి పూర్తి అండదండలందించనున్నారు.వృద్ధులకు బాసటగా నిలిచేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నాం. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతాం. స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా అసక్తి ఉంటే తమతో చేతులు కలుపవచ్చు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా తెలుసుకొని, వాటిని విశ్లేషిస్తూ పరిష్కారం కోసం తమ వంతు కృసి చేస్తాం. వృద్ధుల సురక్షితమే తమ ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం. సురక్షితమైన నగరంలో వృద్ధులందరికీ మేమున్నాం.. మా నీడలో మీరు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నారని చాటిచెబుతామని నగర పోలీస్ కమిషనర్, అంజనీకుమార్ అన్నారు.

Related Posts