ఆత్మహత్యలు వద్దు పోరాటాలు చేయాలి
పత్తికొండ :
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు పోరాటాలు చేసి తమ హక్కులను సాధించు కోవాలని రైతన్నలతో సీపీఐ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గిడ్డయ్య అన్నారు పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని ఉన్న చెరువులకు హంద్రీనీవా కాలువ నీటితో నింపక పోతే రైతులకు ఆత్మహత్యలే & పందికోన రిజర్వాయర్ క్రింద ఉన్న ఎడమ కాలువ ను పూర్తి చేసి సాగునీరు అందించక పోతే రైతులకు ఆత్మహత్య లే చారణ్యం అని పత్తికొండలో సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో వినూత్నంగా రైతులు ఉరితాడు బిగించు కొని ఆత్మహత్యలు చేసుకుంటున్నాట్లు రిలేనిరహారా దీక్షలకు మద్దుతుగా స్థానిక నాలుగు స్తంభాల దగ్గర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ రైతులు ఆత్మ స్త్యేర్యం కోల్పో వద్దని పాలక ప్రభుత్వల పై పోరాటాలు చేసి తమ హక్కులను సాధించు కోవాలని ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చెరువులు --కుంటలు నింపకపోతే పాలకులు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిన వారు అవుతారని చెప్పారు. పంది కోన రిజర్వాయర్ క్రింద ఉన్న ఎడమ కాలువను పొడిగించి పూర్తి చేయడం వలన పత్తికొండ మండలంలోని చాలా గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందుతుందని ఆయన తెలిపారు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలేనిరహారా దీక్షలు 17 వ రోజుకు చేరిన ప్రభుత్వ అధికారులు ,ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడం చాలా దురదృష్టకరం అని అయన అన్నారు.రైతు సంఘం నాయకులు రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తిమ్మయ్య, సురేంద్ర, కారన్న, పెద్ద ఈరన్న, నెట్టేకంటయ్య,సుంకన్న లు పాల్గొన్నారు.