YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ముస్లింల అభివృద్ధి జగన్ తోనే సాధ్యం

ముస్లింల అభివృద్ధి జగన్ తోనే సాధ్యం

ముస్లింల అభివృద్ధి జగన్ తోనే సాధ్యం
తుగ్గలి  :
ముస్లింల అభివృద్ధి జగన్  తోనే సాధ్యమవుతుందని,జగన్ మోహన్ రెడ్డి మైనారిటీల పక్షపాతి అని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలమూరు రఫీ అన్నారు.తుగ్గలిలోని స్థానిక వివేకానంద పబ్లిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ముస్లింలకు అధికంగా సీట్లు కేటాయించి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కు దక్కుతుంది అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా కల్పించటం హర్షణీయమన్నారు,అలాగే ముస్లిం పట్ల చిత్తశుద్ధితో అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను సర్వే చేయించి వాటిని ముస్లిం సమాజం,యువత కు ఉపయోగపడేల చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం తుగ్గలి మండల అధ్యక్షుడు గా షేక్ షేక్షవలి,కార్యదర్శి గా మహబూబ్ భాషలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం తుగ్గలి మండల అధ్యక్షుడు షైక్ షైక్షావలి మాట్లాడుతూ ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాబ్దిన్ నూర్ బాషా,జిల్లా కార్యదర్శి షేక్ ఉస్మాన్ భాష,ఆలూరు అధ్యక్షుడు రహంతుల్ల,డీలర్ మహమ్మద్ సాహెబ్,హయత్ బాషా,ఖాసీం వలి,ఇర్ఫాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Related Posts