YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అడ్డూ,అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు

అడ్డూ,అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు

అడ్డూ,అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు
హైద్రాబాద్, 
బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల ఇండ్లకు అధికారులు నోటీసులు జారీ చేసినా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని టౌన్ ప్లానింగ్ అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని కమిషనర్, తహసీల్దార్ కు వినతిపత్రాలు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుల్లో వెంచర్లు వెలుస్తున్నాయని బాలాపూర్ చెరువు పరిరక్షణ  సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్, బడంగ్ పేట్ కమిషనర్, ఇరిగేషన్ అధికారుకు ఫిర్యాదులు చేసినా ఆక్రమణలు ఆగడం లేదు. కాలనీలలో ఉన్న ఓపెన్, పార్కు స్థలాలను సైతం కబ్జా చేసి రియల్ వ్యాపారం చేస్తున్నారని అల్మాస్ గూడ కు చెందిన నాగరాజు గౌడు లిఖిత పూర్వకంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అల్మాస్ గూడ లోని  గ్రీన్ బెల్టులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలున్నా కట్టడాలు చేపడుతున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులే వాపోతున్నారు. పంచాయతీ వ్యవస్థ పోయి మున్సిపాలిటీ, ఆపై  కార్పొరేషన్ గా ఏర్పడిన  తర్వాత కూడా పంచాయతీ అనుమతులతో ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే కొంత మందిపెద్దలు అడుపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. మీర్ పేట్, జిల్లెలగూడ, బడంగ్ పేట్, నాదర్ గుల్, వెంకటాపూర్, కుర్మల్ గూడ, మామిడి పల్లి, బాలాపూర్ లలో ఆక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని ఏసీపీ కోటేశ్వర్ రావు అందోళన వ్యక్తం చేశారు. వీటి కారణంగా కార్పొరేషన్ ఆదాయానికి కోట్లలో గండి పడుతోందని ఆధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాలాపూర్ మండలంలోని చెరువుల్లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని చెరువుల పరిరక్షణ సమితి నాయకులు ఆధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ప్రభుత్వ భూములకు తప్పుడు సర్వే నెంబర్లు వేసి రియల్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు ఇంటి నెంబర్స్ ఎలా ఇస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువుల్లో నిర్మాణాలను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే కార్పొరేషన్ ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తి న్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల ఆక్రమణలు సీఎం దృష్టికి తీసుకుపోతామని చెరువు పరిరక్షణ సమితి నాయకుల బి. జంగయ్య, గడ్డం వెంకటేశ్, నీరుడు శ్రీరాములు తెలిపారు.మీర్ పేట్, జిల్లెలగూడ, బడంగ్ పేట్, ఆల్మాస్ గూడ, గుర్రంగూడ, నాదర్గుల్, బాలాపూర్, వెంకటాపూర్, మామిడిపల్లిలో పంచాయతీ వ్యవస్థ పోయి ఆరేళ్లు అయినా ఇప్పటికీ పంచాయతీ పేరుతోనే అనుమతులు ఇస్తున్నారని బడంగ్ పేట్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులతో ఇంటి నెంబర్ కోసం దరఖాస్తులు చేసుకుంటే వంద శాతం ఇంటి పనులు వేస్తున్నామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. పాత పర్మిషన్లు చెల్లవని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అప్పడు డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు

Related Posts