తలనొప్పిగా మారిన అవంతి వ్యవహారం
విశాఖపట్టణం, అక్టోబరు 1,
మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారశైలి అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ.. వైసీపీ ముఖ్యనేతలకు.. ఇబ్బందికరంగా మారిపోతోంది. రాను రాను ఆయన.. తనను మించిన వారు లేరనట్లుగా మాట్లాడుతూవ్య వహరిస్తూ పోతూండటం ప్రభుత్వ పెద్దలను సైతం.. అసహనానికి గురి చేస్తోందని చెబుతున్నారు. కేబినెట్ సమావేశాల్లో రన్నింగ్ కమెంటరీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఒకటి, రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ ఆయన తీరు మార్చులేదని సెక్రటేరియట్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తన శాఖకు సంబంధించి ఆయన చేసే సమీక్షా సమావేశాల్లో అధికారులపై ఏకవచనంతో విరుచుకుపడుతూండటం.. అధికారుల్ని సైతం విస్మయ పరుస్తోంది. మొదట్లోనే ఓ మహిళా అధికారితో కటువుగా మాట్లాడిన ఘటన.. వివాదాస్పదమయిందని.. ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అధికారులతో ఆయన ప్రవర్తించే తీరు.. దారుణంగా ఉంటోంది. సమీక్షా సమావేశాలన్నీ.. అంతర్గతంగా జరుగుతంటాయి కాబట్టి.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ బహిరంగ కార్యక్రమాల్లో కూడా.. ఆయన తీరు.. అధికారుల్ని అవమాన పరిచేలా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం.. ఢిల్లీలో… జరిగిన ఓ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో.. టూరిజం శాఖ మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్‌ను అవంతి లెక్క చేయలేదు. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చే అవార్డులను.. మంత్రితో పాటు…టూరిజం ఎండీ ఇద్దరూ సంయుక్తంగా అందుకోవాల్సి ఉంది. అయితే.. ప్రవీణ్ కుమార్‌ను.. పక్కన నెట్టేసి.. అవార్డులన్నీ.. అవంతినే అందుకున్నారు. అంతే కాదు.. ఆయనను అవార్డులు మోయడానికి ఉపయోగించుకున్నారు. ఈ ఘటన.. అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. అవంతి ఈ తరహా ప్రవర్తన..రాజకీయ పరంగానూ కొనసాగుతోంది. గంటా శ్రీనివాసరావుపై.. ఆయన ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అంత అవసరం ఏముందన్న సూచనలు.. వైసీపీ హైకమండ్ వచ్చాయని ప్రచారం జరిగినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. తాజాగా.. ఆయన విశాఖలో మరో నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పై గురి పెట్టారు. జీవీఎంసీ ఎన్నికలు జరిగితే..ఆయన మేయర్ అవుతారని అనుకుంటున్నారేమో కానీ.. ఆయనపై గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడిగా పాల్గొనే కార్యక్రమం ఏదైనా.. విమర్శలు చేస్తూండటంతో.. అవంతి వ్యవహారం వైసీపీలో .. హాట్ టాపిక్‌గా మారుతోంది