YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెలంగాణలో రాజకీయ క్రీడ

Highlights

  •  'థర్డ్ ప్రంట్'తో ప్రారంభం
  •  మరదలి కొడుకుకు 'రాజ' కిరీటం
  •  అడుగులొత్తే అధికారులకు అందలం
  •  బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికేనా...!
  •  అమరవీరుల పేరెత్తే ధైర్యం ఉండేనా..?
తెలంగాణలో రాజకీయ క్రీడ

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ బాస్ రాజకీయ క్రీడకు తెరతీశారు. అధికారపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)  వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం తన ఎత్తుగడలను ప్రారంభించింది. అందుకు అనుగుణంగా తెరమీదకు జాతీయస్థాయి 'థర్డ్ ప్రంట్' పేరుతో హడావుడి. రాష్ట్రంలో వారసులకు పదవులు పందేరం లక్ష్యం. తన మరదలి కొడుకుకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టే ప్రయత్నంలో అమరవీరుల త్యాగం ముందుకు రాకుండా అంచెలంచెలుగా గులాబీ నేత ఎత్తుగడలు ఉన్నాయి.

 రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గులాబీ గెలుపు కోసం ప్రణాళిక బద్ధంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే  ముందుగా  ఐ.ఏ.ఎస్., ఆ తరువాత ఐ.పి.ఎస్.ల బదిలీలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఆ పార్టీ నాయకులను నియంత్రించే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రధాన పార్టీలను నిర్వీర్యం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలకు పదును పెడుతోంది. అధికారపార్టీ గెలుపు అడుగులకు ఆర్థిక మడుగులొత్తే అధికారులను అందలం ఎక్కించింది. అది ఏస్థాయిలో జరిగిందంటే... "ఓ అధికారి జిల్లా ఏస్పీగా పనిచేసిన సందర్బంలో... ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై శాఖాపరమైన 'దర్యాప్తు ఫైల్' గల్లంతు  చేసేంత. 

తాజా ఎత్తుగడ: రాబోయే ప్రభుత్వం తమదే కావాలంటే నల్గొండ జిల్లా చాలా కీలకం. ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన కాంగ్రెసు నాయకుడు. ఇటీవలే ఆయన తన కీలకమైన అనుచరుడిని 'హఠాత్తు హత్యోదంతం'తో కోల్పోయారు. ఈ కేసు విచారణలో ప్రభుత్వం అప్రతిష్ట మూట గట్టుకొంది. దీంతో కోమటిరెడ్డికి వచ్చిన సానుభూతిని దెబ్బ కొట్టాలంటే అధికారపార్టీకి బలమైన నాయకులు అవసరం ఎంతో ఉంది. వలసలతో ఊగిసలాడే ఈ పరిస్థితులలో ప్రత్యర్థులను ఊహించని రీతిలో దెబ్బకొట్టాలని గులాబీ నేత ఆలోచన. గులాబీ దళం తమకు అనుకూలంగా ఉన్న ఏ చిన్న అవకాశం జారవిడుచుకోదు. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజకీయ ప్రాబల్యం తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 'అసెంబ్లీ ఘటన' అవకాశంగా తీసుకొని వేగంగా ఎత్తులు వేసింది. గతంలో ఇంతకంటే ఎక్కువ హడావుడి చేసిన హరీష్ రావు 'అసెంబ్లీ ఘటన' అధికార పార్టీకి ఈ సందర్భంగా బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

బది'లీలల'తో దిగజారిన ప్రతిష్ట :ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.ల బదిలీలు జరిగాయి. అయితే
ఆదివారం జరిగిన ఐ.పి.ఎస్ అధికారుల జాబితాలో నల్గొండ జిల్లా ప్రస్థావన లేదు. అసెంబ్లీలో సోమవారం 'రభస' జరిగిన తరువాత పరిణామాలు వేగంగా మారాయి. న్యాయస్థానం ఒకవైపు రంగనాథ్ పై విచారణ చేస్తుండగా, మరో వైపు ఎన్నో కేసులు ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నారు. అవేమీ పట్టించుకోకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ.పి.ఎస్. అధికారి రంగనాథ్ ను నల్గొండ జిల్లా ఎస్.పి.గా నియమించింది. ఆయన ఒక్కడికే సోమవారం అసెంబ్లీ సంఘటన తరువాత ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది.ఈ ఐ.పి.ఎస్. అధికారి సచ్చీలరనే సంకేతం రేపు ఎన్నికలలో టి.ఆర్.ఎస్.కు వ్యతిరేకత వస్తుందనే కనీస పరిజ్ఞానం ఆ పార్టీ వ్యూహకర్తలకు లేకపోవడం విశేషం.

'నిఘా' చూస్తుండగా.. నిసిగ్గుగా...:ప్రణభ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే రంగనాథ్ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంటరీ ఆధారాలతో అందిన పిర్యాదును నేరుగా కేంద్రనిఘా విచారణ సంస్థ (సి.బి.ఐ.)కు చేరింది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ చేసిన శాఖాపరమైన దర్యాప్తుకు సంబంధించిన 'ఫైల్ గల్లంతు'పై కూడా ఇప్పటికే నీఘా సంస్థ ఒక నిర్థారణకు వచ్చిందని తెలిసింది. ఇన్ని ఆరోపణలు ఉన్న ఆ అధికారికి నల్గొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించడం వెనుక బాగానే ఆర్థిక, ఎన్నికల కసరత్తు జరిగిందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలక్రమేణా అంచెలంచెలుగా భధ్రత తగ్గించి, ఆయన కార్యకర్తలను బలహీన పర్చటమే లక్ష్యంగా ఈ ఆధికారికి పరిపూర్ణంగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అందుకు ఆ అధికారి గతంలో చేసిన ప్రతి 'ఘనకార్యం' పరిశీలించే నల్గొండ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా తన పాత్ర గుంభనంగా, చాకచక్యంగా పోషిస్తానని మాట ఇచ్చి నల్గొండ బాధ్యతల స్వీకారానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.


 

Related Posts