YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సర్పంచ్ సంఘం నేత భూమయ్యను విడుదల చేయాలి

సర్పంచ్ సంఘం నేత భూమయ్యను విడుదల చేయాలి

సర్పంచ్ సంఘం నేత భూమయ్యను విడుదల చేయాలి
హైదరాబాద్, అక్టోబరు 1,  
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మా పార్టీ మద్దతు కోరింది. మా పార్టీ కార్యనిర్వాహక వర్గం లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 

మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూమన్న ను విడుదల చేయాలి. మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం. భూమన్న ను 

సూర్యాపేట లో అరెస్ట్ చేయలేదని పోలీసులు ఎన్నికల సంఘానికి తప్పుడు నివేదిక ఇచ్చారని అయన ఆరోపించారు. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఈ అరెస్ట్ లని 

అయన అన్నారు. మాకు ఉన్న వనరుల పరిమితం. అందుకే పోటీ కి దూరమని అయన అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతామని 

కోదండరాం అన్నారు.
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూగత ఎన్నికల్లో పసుపు రైతులు కవిత ను ఎలా ఓడించారో..హుజూర్ నగర్ లో కూడా సర్పంచ్ సంఘం నేతలు టిఆర్ఎస్ ను 

ఓడిస్తారనే భయం టిఆర్ఎస్ నేతలకు పట్టుకుంది. హుజూర్ నగర్ లో నామినేషన్ వేయకుండా  సర్పంచ్ సంఘం నేతలను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి. డీజీపీ 

తో ఫోన్ లో మాట్లాడాం. అడిషనల్ డీజీపీ ని కలుస్తామని అన్నారు. 
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముజూర్ నగర్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం కు విజ్ఞప్తి చేసాం. సిద్దాంత పరంగా మా రెండు పార్టీ లది 

ఓకే ఎజెండా. నిరంకుశ ,నియంతృత్వ పోకడలకు మా రెండు పార్టీ లు వ్యతిరేకం. కోదండరాం కు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. హుజూర్ నగర్ చుట్టు పక్కల 

ఉన్న నియోజకవర్గాల టీజేఏస్ నేతలు మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. కేటీఆర్ ,కేసీఆర్ లది ఎన్నికల లో ఓట్లు  కొనుగోలు చేయడమే ఎజెండా. కేసీఆర్ డబ్బు తో ఎన్నికల్లో 

గెలవాలని అనుకుంటున్నాడని విమర్శించారు. 

Related Posts