YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దశల వారీగా మద్యం పాలసీ

దశల వారీగా మద్యం పాలసీ

దశల వారీగా మద్యం పాలసీ
విజయవా 
దశల వారీగా మద్యపానం నిషేధం దిశగా అడుగులేస్తోన్న జగన్ సర్కారు మంగళవారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మద్యం ధరలను పెంచింది. స్వదేశీ తయారీ లిక్కర్ విభాగంలో క్వార్టర్‌పై రూ.20 చొప్పున పెంచింది. ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరగ్గా.. ఫారిన్ లిక్కర్‌‌పై రూ.10 నుంచి రూ. 250 వరకు ధర పెంచింది. బీరుపై రూ.20, చిన్న బీరుపై రూ.10 చొప్పున ధరలు పెంచింది. ధరల పెంపు కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పెంచిన ధరలకు అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ) అనే పేరుపెట్టారు. ఇప్పటికే షాపులకు చేరిన మద్యం బాటిళ్లపై పాత ధరలే ఉన్నాయి. కానీ పెరిగిన ధరల ప్రకారమే మద్యం విక్రయిస్తారు.మద్యం అమ్మకాల సమయాన్ని కూడా ఏపీ సర్కారు కుదించింది. గతంలోనే ఓ గంట కుదించిన ప్రభుత్వం ఇప్పుడు మరో రెండు గంటలు తగ్గించింది. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించేవారు. కానీ ఎక్సైజ్ పాలసీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయించాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ తాజాగా దాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మార్చింది. ఈ సమయం కేవలం మద్యం విక్రయించే ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు మాత్రమే వర్తిస్తుంది. బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటాయి.ఇప్పటివరకూ మద్యం విక్రయించిన వ్యాపారులకు 10 శాతం మార్జిన్ ఇచ్చేవారు. ఇక నుంచి ఎక్సైజ్ శాఖకు ఆరు శాతం, షాపులను నిర్వహించే ఏపీఎస్‌బీసీఎల్‌కు 4 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు

Related Posts