YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం 

ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం 

ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం 
హైదరాబాద్ 
రవీంద్రభారతిలో ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం ఘనంగా జరిగింది. వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చాలా ఇళ్లల్లో వృద్దులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వారికి కనీస సౌకర్యాలు కూడా వారి కుటుంబాలు కల్పించలేకపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వృద్దుల సమస్యలను గ్రహించి ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో13 లక్షల మంది వృద్దులకు రూ. 2,016 చొప్పున ఫించను ఇస్తున్నట్లు తెలిపారు. వృద్దుల హక్కులను కాపాడేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.జిల్లా కేంద్రాల్లోని వృద్దాశ్రమాలతో పాటు నూతన జిల్లా కేంద్రాల్లోనూ వృద్దాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వృద్దులకు వైద్యం, ప్రయాణ రాయితీ కల్పించే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు. పెద్దవారు సమాజానికి మార్గదర్శకులు, వారికి తగిన గౌరవం ఇవ్వాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకుడు డాక్టర్ సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు వృద్దులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీష్, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.

Related Posts