ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన టీడీపీ
గుంటూరు అక్టోబర్ 1
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డ్రైవ్ పూర్తయింది. తర్వాత కూడా సభ్యత్వం నమోదవుతోంది. 7.5లక్షల సభ్యత్వ నమోదయింది. మోదీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోందని ఆ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడి వైపు చూస్తోంది. చరిత్రలో మోడి,అమిత్
షా శాశ్వతంగా నిలిచిపోతారు. ఒక్క రక్తం బొట్టు కూడా రాలకుండా సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. దేశ ప్రతిష్ట ను పెంచారు. 2019 నుండి పార్టీలో అనేకమంది చేరుతున్నారు.
దళితులు,మైనార్టీ లు ఎక్కువ మంది చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయమివ్వాలనుకున్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కుంటు
పడేలా ఉన్నాయి. టిడిపి ఆర్థిక పరిస్థితి ని చిన్నాభిన్నాం చేసింది. మొదటి ఏడాది ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోందని అన్నారు. టిడిపికి
వైసిపికి తేడా లేకుండా పోయింది. ఇసుక పాలసీ వచ్చి నెల అయినా సామాన్యుడికి ఇసుక దొరకటం లేదు. బ్లాక్ లో మాత్రం దొరుకుతోంది. కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్ అమలు
చేయటం లేదు. ప్రభుత్వ ఖర్చుతో ఒక మతాన్ని పెంచి పోషిస్తోంది. హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో ఉన్నారు. జాతీయ పార్టి అయిన బిజెపి ఏ ప్రాంతీయ పార్టీకి తొత్తుగా,
అద్దె మైకుగా పనిచేయదని అన్నారు. పది రిజర్వేషన్ కోరుతూ 4న కలెక్టరేట్ల వద్ద ధర్నా . ఇసుక కొరతపై 7 తేదిన భిక్షాటన, 11 న పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని
ప్రాజెక్టు ప్రాంతాన్ని పరీశిలించే కార్యక్రమాలు వుంటాయని అయన అన్నారు.