దారుణం... కూతురుపై రేప్
లండన్, అక్టోబరు 3,
రక్త సంబంధానికి, నాన్న అన్న పదానికే మాయని మచ్చ తెచ్చిన ఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే కామంతో అత్యాచారానికి పాల్పడ్డాడో కీచక తండ్రి. అలా వీలుచిక్కినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతూ కన్న కూతురినే ఆరుగురు బిడ్డలకు తల్లిని చేశాడు. యూకేలో వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి.సౌత్ వెస్ట్ వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన సంతానంలో ఒకరైన 16ఏళ్ల బాలికపై ఎంతో కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తండ్రితో శృంగార జీవితాన్ని పంచుకుంటే స్వర్గలోకానికి వెళ్తారంటూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ బాలిక తండ్రి కారణంగా ఇప్పటికే ఆరుగురు సంతానికి జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.ఈ కేసు వివరాలను స్వాన్‌సీ క్రౌన్ కోర్టులో విచారణకు రావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్ హిప్కిన్ వివరాలు వెల్లడించారు. కన్న కూతురిపైనే అంతటి అఘాయిత్యానానికి పాల్పడిన కామాంధుడిపై 36కేసులు నమోదు చేశారు. ఆ దేశ నిబంధలన ప్రకారం నిందితుడు పేరు, వివరాలను అధికారులు బయటపెట్టలేదు. 2018లో నమోదైన ఈ కేసు మూడు వారాలుగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే తుదితీర్పు వచ్చే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.ఈ కేసు విచారణ సందర్భంగా తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురైన బాలిక ఇచ్చిన వాంగ్మూలం అందరినీ కంటతడి పెట్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, అతడి వల్ల ఆరుగురి సంతానానిని జన్మనిచ్చినట్లు తెలిపింది. తండ్రి వారానికి కనీసం మూడుసార్లు తనతో సెక్స్ చేసేవాడని, కారులో, బెడ్‌రూమ్‌లోనే కాకుండా ఒక్కోసారి బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేసేవాడని వెల్లడించింది. ఒకసారి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి బెడ్‌రూమ్‌లోకి వెళ్లానని చెప్పాడని, తీరా అక్కడికి వెళ్లాక తండ్రి ఫ్రెండ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. తండ్రి తన శరీరంతో వ్యాపారం చేస్తున్నాడని, ఎంతో మంది విటులను ఇంటికే తీసుకొచ్చి వ్యభిచారం చేయించేవాడని చెప్పి కన్నీరు పెట్టుకుంది. తండ్రి తనపై లెక్కలేనన్ని సార్లు అత్యాచారం చేశాడని, అతడిని ఎదిరిస్తే తోబుట్టువులతో సంబంధాలు కట్ చేస్తాడన్న కారణంతోనే మౌనంగా భరిస్తూ వచ్చినట్లు చెప్పింది.