YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇమేజ్ డ్యామేజ్ తో సిద్ధూ బ్యాక్ స్టెప్

ఇమేజ్ డ్యామేజ్ తో సిద్ధూ బ్యాక్ స్టెప్

ఇమేజ్ డ్యామేజ్ తో సిద్ధూ బ్యాక్ స్టెప్
బెంగళూర్, అక్టోబరు 3
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాలం కలసి రావడం లేదు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలోనే సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య చెప్పిందే వేదం అన్నట్లు గా ఐదేళ్ల పాటు నడిచింది. వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ నేతలున్నా సిద్ధరామయ్య తన చతురతతో ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పదవీకాలాన్ని పూర్తి చేయడం ఆషామాషీ కాదు. గత శాసనసభ ఎన్నికల్లోనూ సిద్ధరామయ్య మాటే చెల్లుబాటు అయింది. ఆయన చెప్పిన వారికే అధిష్టానం ఎక్కువగా టిక్కెట్లు పంపిణీ చేసింది.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 స్థానాలను సాధించి కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇందులో సిద్ధరామయ్య కృషి ఉందని అధిష్టానమూ నమ్మింది. అందుకే సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసి ఆయనను సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. అంతేకాకుండా శాసనసభ పక్ష నేత బాధ్యతలను కూడా హైకమాండ్ సిద్ధరామయ్యకే అప్పగించింది. పథ్నాలుగు నెలల పాటు సిద్ధరామయ్య జోడు పదవులను నిర్వహించినా కాంగ్రెస్ నేతలు కిమ్మన లేదు. మంత్రి పదవులు కూడా సిద్ధరామయ్య ఇష్టప్రకారమే అప్పట్లో చేపట్టారు.ఇక సంకీర్ణ సర్కార్ కూలి పోయిన వెంటనే సిద్ధరామయ్య కు పార్టీలో ఉన్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అయిపోయిందనే చెప్పాలి. సంకీర్ణ సర్కార్ కుప్ప కూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమంటూ కాంగ్రెస్ లోనే విమర్శలు ప్రారంభమయ్యాయి. పార్టీని విడిచి వెళ్లిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు గతంలో సిద్ధరామయ్య అనుచరులుగా ముద్రపడిన వారు కావడంతో ఆ ఆరోపణల నుంచి ఆయన తప్పించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ ఎస్ కూడా ఇదే తరహాలో విమర్శలు చేస్తూ వస్తోంది.సిద్ధరామయ్య ప్రస్తుతం శాసనసభ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆయనకున్న అనుభవం, మాజీ ముఖ్యమంత్రి కావడంతో సిద్ధరామయ్యనే ఆ పదవిలో కొనసాగించాల్సి ఉంటుంది. కానీ సిద్ధరామయ్యపై పూర్తి స్థాయిలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్యకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కూడా లభించలేదు. మరోవైపు ఈ పదవి కోసం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మనీ ల్యాండరింగ్ కేసులో జైలుపాలయిన డీకే శివకుమార్ రేసులో ముందున్నారు. సిద్ధరామయ్యను మాత్రం ఈ పదవి నుంచి తప్పించడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. మరి సిద్ధరామయ్య తనంతట తాను స్వచ్ఛందంగా తప్పుకుంటేనే బెటరంటున్నారు పార్టీ నేతలు

Related Posts