YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చుక్క నీరు లేకుండా ఘనా ప్రాజెక్టు

చుక్క నీరు లేకుండా ఘనా ప్రాజెక్టు

చుక్క నీరు లేకుండా ఘనా ప్రాజెక్టు
మెదక్, అక్టోబరు 3,
మెదక్ జిల్లా రైతాంగానికి పెద్దదిక్కుగా నిలుస్తోన్న ఘనపురం ప్రాజెక్ట్‌ అభివృద్ధి పనులు ఏళ్లకేళ్లుగా కొనసా.. గుతూనే ఉన్నాయి.ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్ట్‌లో చుక్క నీరు లేదు. మంజీర 

నది ప్రవాహం లేకపోవడం.. సింగూరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఉంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. గత ఏడాది సింగూరు నుంచి 15 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా 

నిజామాబాద్‌ జిల్లా అవసరాలకు తరలించడంతో ప్రస్తుతం ఎకరా కూడా సాగు చేయని దుస్థితి నెలకొందని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆ నీళ్లు ఉంటే కనీసం ఒక్క పంటయినా 

వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రస్తు తం చుక్క నీరు లేని పరిస్థితుల్లో మంజీర పరవళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి 

అక్కడే అన్న చందంగా మారాయి. సుమారు 14 సంవత్సరాలుగా ఆయకట్టు రైతులను వెక్కిరిస్తూనే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై 

దృష్టిసారించింది. నిధులు సైతం కేటాయించినప్పటికీ.. ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంజీరా నదిపై కొల్చారం–పాపన్నపేట మం 

డలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905 లో ఘనపూర్‌ మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 0.2 

టీఎంసీలు. దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్‌నహర్, ఫతేనహర్‌) ఉండగా.. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్‌నహర్‌ (ఎంఎన్‌) కెనాల్‌ పొడవు 42.80 

కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్‌ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్‌ (ఎఫ్‌ఎన్‌) కెనాల్‌ 

పొడవు 12.80 కి.మీ కాగా.. పాపన్నపేట మండలంలోని 11 గ్రామా ల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది.ఘనపూర్‌ కాల్వల ఆధునికీకరణ కోసం 2005లో జైకా 

పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వినియోగించకపోవడంతో వెనక్కిమళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 

సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వయంగా 2014 డిసెంబర్‌ 17న ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ బాట పట్టారు. 

సందర్శించిన సమయంలోనే ప్రాజెక్ట్‌ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి కృషి, అప్పటి 

నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో వెనక్కి మళ్లిన జైకా నిధులు తిరిగివచ్చాయి. సీఎం హామీ మేరకు ఓసారి రూ.21.64 కోట్లు, ఆ తర్వాత రూ.43.64 

కోట్లతోపాటు మరో రూ.1.64 కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునికీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు, భూసేకరణకు ఈ నిధులు మంజూరయ్యాయి. తాజాగా 

ఇటీవల బడ్జెట్‌లో ఘనపూర్‌ ప్రాజెక్ట్‌కు రూ.34 కోట్లు కేటాయించారు.మహబూబ్‌నహర్, ఫతేనహర్‌ కెనాల్‌ ఆధునికీకరణలో భాగంగా సిమెంట్‌ లైనింగ్‌ పనులు చివరి వరకు కాలేదు. 

ఫతేనహర్‌ కెనాల్‌ పొడవు 12.80 కిలో మీటర్లు కాగా.. దౌలాపూర్‌ వరకు.. మహబూబ్‌నహర్‌ కాల్వ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా మత్తాయిపల్లి వరకు (32 కి.మీలు) 
మాత్రమే సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నహర్‌ కెనాల్‌ కిందశాలిపేట నుంచి జక్కన్నపేట వరకు.. ఫతేనహర్‌ కెనాల్‌ కింద 11 కి.మీల మేర పాపన్నపేట వరకు 

బ్రాంచ్‌ కాల్వ పనులు, గైడ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. ఫతేనహర్‌ కెనాల్‌ కింద గాంధారిపల్లి, జయపురం, లక్ష్మీనగర్, అబలపూర్, అన్నారం, యూసుఫ్‌పేట్, కుర్తివాడ, మిన్పూర్, 

పాపన్నపేట, నాగ్సానిపల్లి, పొడిచంపల్లిలో సీసీ లైనింగ్‌ పనులు పూర్తి కాలేదు. ఇలా ఏళ్లకేళ్లుగా పనులు కొనసాగుతుండగా.. మొదట చేసినవి శిథిలావస్థకు చేరాయి. దీంతో చివరి 

ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ప్రాంతాల్లో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ పరిస్థితి 

నెలకొన్నట్లు సమాచారం. గత బడ్జెట్‌లో మంజూరైన వాటిలో సుమారు రూ.13 కోట్లు భూసేకరణకు కేటాయించగా.. అవి అలానే ఉన్నట్లు సమచారం. మొత్తం 290 ఎకరాల భూమి 

అవసరం కాగా.. ఇప్పటివరకు 230 ఎకరాలను క్లియర్‌ చేసినట్లు అధికారిక సమాచారం. 60 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ తదితరులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించే 

ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్న ఘనపూర్, సంగాయిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ 

బడ్జెట్‌లో భూసేకరణకు నిధులు కేటాయించడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు.

Related Posts