రోడ్లకోసం నిరసన
విజయనగరం అక్టోబరు 3,
విజయనగరం జిల్లా కొమరాడ మండలం రామభద్రపురం గ్రామస్థులు గురువారం నిరసనకు దిగారు. విజయనగరం - రాయఘడ జీతీయ రహదారిపై వినూత్నంగా నిరసన ప్రదర్శించారు. రహదారి మొత్తం నేల నూతులను తలపిస్తుంటే గుంతలో ఈత కొడుతూ నిరసన తెలిపారు. గత వారం క్రితం ఇదే రోడ్డుపై వారి నాట్లు వేసి నిరసన తెలిపపారు. నిత్యం వందలాది భారీ వాహనాలు గతుకుల్లో దిగిపోతున్నాయి. నిత్యం నరకం చూస్తున్నమని వాహన దారులు అంటున్నారు. ఈధర్నాలో పాల్గొన్న గ్రామస్థులతోపాటు సిపిఎం, సిపిఐ, టిడిపి నేతలు కుడా పాల్గోన్నారు.