YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం గా దర్శనం ఇంద్రకీలాద్రి

గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం గా దర్శనం ఇంద్రకీలాద్రి

గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం గా దర్శనం
ఇంద్రకీలాద్రి అక్టోబరు 3, 
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు దసరా ఉత్సవాలలో 5వ రోజు గురువారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. ఈ అమ్మవారు శ్రీ చక్ర అధిష్టానశక్తిగా , పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను , ఉపాసకులను అనుగ్రహిస్తుంది.  శ్రీ లక్ష్మీదేవి , శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో , వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై  కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు . త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులచేత పూజలందుకొంటారు . ..ఈ రోజు అత్యంత శోభాయమానంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహామండపం పై వున్న మహాగోపురం ప్రాంగణంలో  ఏర్పాటుచేసిన దుర్గమ్మను శ్రీశ్రీశ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా అలంకరిచడం, ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలు ,  పూలమాలలు, తోరణాలతో విశేషం గా అలంకరణ చేశారు. 

Related Posts