YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకెైజ్ అధికారులు భారీ దాడులు

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకెైజ్ అధికారులు భారీ దాడులు

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకెైజ్ అధికారులు భారీ దాడులు
కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు
కర్నూలు  అక్టోబరు 3,
కర్నూలు జిల్లా అవుకు మండలం కొండమనాయుపల్లె. పిక్కలపల్లె తండా గ్రామాలలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి.  రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టర్ హరి కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె స్టేషన్ల వారు దాదాపు 50 మంది పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 9100 లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేశారు. ఒక  వ్యక్తి ని అదుపులోకి తీసుకొవటం తో పాటు 61లీటర్ల నాటుసారా ను,ఓ బైకు ను స్వాధీనం చేసుకున్నారు. .దశలవారీగా మద్యనిషేధం అమలుకై ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే నాటు సారా పై ఇంత భారీ దాడులు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు  ఉన్నతాధికారులు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు భారీ ఎత్తున నాటుసారా ను తయారు చేస్తున్న అధికారులు అంతగా పట్టించుకోకపోవడం కాగా భారీ దాడులు నిర్వహించడం తో నాటుసారా తయారీదారుల్లో  వణుకు పుడుతోంది.  ఇకనుండి సారా తయారు చేసినా,  అమ్మినా వారికి సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవుకు నుండి గ్రామీణ పల్లెలు కు సారా బెల్లం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. సారా అమ్ముతూ పట్టు పడిన వారికి రెండు కేసులు దాటితే పీడియాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు.  పీడియాక్టు కింద కేసులు నమోదైతే ఆరు నెలల వరకు బెయిలు  రాకుండా జైల్లో గడపాల్సి వస్తుందని అన్నారు. 

Related Posts