YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

సింగరేణి విఆర్ఎస్ కార్మికుల మహాధర్నా

సింగరేణి విఆర్ఎస్ కార్మికుల మహాధర్నా

విఆర్ఎస్ కార్మికుల మహాధర్నా
భద్రాద్రి కొత్తగూడెం  అక్టోబరు 3,
కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట విఆర్ఎస్ కార్మికులు వారి డిమాండ్లను పరిస్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. గతంలో సమైక్య రాష్ట్రంలో మోసపూరిత కుట్రల వల్ల విఆర్ఎస్ స్కీమ్ ద్వారా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయామని,  దాని వల్ల అనేక సంవత్సరాల సర్వీసు, డబ్బును కోల్పోయామని ఆరోపించారు.  తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారిందని ,పిల్లల పెళ్లిళ్లు అర్దాంతరంగా ఆగిపోయాయని వాపోతున్నారు. ఒకే కుటుంభం , ఒకే గమ్యం , ఒకే లక్ష్యం అని సింగరేణి యాజమాన్యం చేపుతుందని  కానీ ఇప్పుడు మా పరిస్థితి ని చూసి కూడా పట్టించుకోట్లేదని అందుకే బీఎంఎస్ ఆధ్వర్యంలో ఈయొక్క మహాధర్నా చేపట్టామని తెలియజేశారు

Related Posts