నిజామాబాద్ లో తహశీల్దార్ ఆత్మహత్య
నిజామాబాద్ అక్టోబరు 3,
నిజామాబాద్ రూరల్ తహశీల్దార్ జ్వాల గిరిధర్ రావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్ బ్యాంక్ కాలనీ లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఆయన
ఆత్మహత్య కు పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. గురువారం ఉదయం వెలుగులో కి రావడంతో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు
సంఘటన స్థలానికి చేరుకున్నారు. గిరిధర్ రావు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారని రెవెన్యూ ఉద్యోగులు చెప్పారు. హైదరాబాద్కు చెందిన గిరిధర్ రావు గత ఎన్నికల
సమయంలో జిల్లాకు వచ్చారు. ఎన్నికల తర్వాత బదిలీ కాలేదు. కలెక్టర్ ఎం. రామ్మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు.