YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

30 రోజులలో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం మంత్రి ఎర్రబెల్లి

30 రోజులలో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం మంత్రి ఎర్రబెల్లి

0 రోజులలో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
మంత్రి ఎర్రబెల్లి
మహబూబ్ నగర్ అక్టోబరు 3,
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో 30 రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి 

దయాకరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మెన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య 

కార్యదర్శి వికాస్ రాజ్,  కలెక్టర్ రోనాల్డ్ రాస్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..
బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు వారికి ఘనస్వాగతం పలికారు.. 30 రోజులను ఛాలెంజ్ గా తీసుకుని గ్రామంలో అపరిశుభ్రతను తొలగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

అన్నారు.. 70 ఏళ్ల పాలన కు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న పాలన కు తేడా చూసుకోవాలని మంత్రి సూచించారు.. వద్దు వద్దు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత 

కెసిఆర్ ది. రైతులు వ్యవసాయం వదిలిపెట్టి పోవద్దు అని ఎకరాకు సంవత్సరానికి 10 వేలు, రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తూ రైతు పక్షపాతిగా పనిచేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం 

అని దయాకర్ రావు స్పష్టం చేసారు.  మహిళలకు, యువకులకు గ్రామ పరిశుభ్రతలో పాలుపంచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.  ఈ గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు విడుదల 

చేయడం జరుగుతుంది.  ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే భాద్యత మా ప్రభుత్వానిదే.  30 రోజుల ప్రణాళిక లో మాత్రమే కాకుండా ప్రణాళిక పూర్తి అయిన తర్వాత కూడా అదే విధంగా 

పనిచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తెలిపారు.
దేశ చరిత్రలోనే తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే 30రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  అధికార గణం మొత్తం ఈ 30 రోజులు గ్రామాల్లోనే మోహరించి 

గ్రామాల దారిద్రాన్ని తరిమి కొట్టామన్నారు. పాత బడిన ఇండ్లు, మురికి కాలువల పూడిక తీత, కూలిన కరెంటు స్తంభాలు తీసివేత త తో పాటు  అభివృద్ధి కార్యక్రమాలు ను పూర్తి 

చేశామన్నారు.  మండలంలో కలెక్టర్ తో కలిసి బాల్యవివాహాలు పూర్తిగా నియంత్రించ గలిగామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అతి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి మండలానికి 

నీళ్ళిస్తాం. వలసల్ని పూర్తిగా నివారిస్తామని  స్పష్టం చేసారు.30 రోజుల ప్రణాళిక అమలు వల్ల గ్రామాల్లో మౌలిక మార్పులు చోటు చేసుకున్నాయి.. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న 

నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. 

Related Posts