YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

నిర్లక్ష్యం = నిరుపయోగం (ఆదిలాబాద్)

నిర్లక్ష్యం = నిరుపయోగం (ఆదిలాబాద్)

నిర్లక్ష్యం = నిరుపయోగం (ఆదిలాబాద్)
ఆదిలాబాద్,అక్టోబర్ 03 : అన్నదాతకు ఆపద్బంధులాంటి పథకం అధికారుల నిర్వాకం కారణంగా నీరుగారిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా నిర్మించిన గోదాములు నిష్ప్రయోజనంగా మారాయి. గిడ్డంగులచుట్టూ ప్రహరీలను, వీటిని చేరుకునేందుకు రహదారులను నిర్మించలేదు. దీంతో వీటిలో పండించిన పంట నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకిలా జరిగిందని మార్కెట్‌ అధికారులను అడిగితే ఈ విషయాలన్నీ పనులు పర్యవేక్షించిన ఇంజినీర్లు చూసుకోవాలని చెబుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో 1.93 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో 1.33 లక్షల మంది రైతులు పంటలు పండిస్తున్నారు. వీరు పండించిన పంటలను నిల్వ ఉంచుకుని మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవడానికి జిల్లాలోని తలమడుగు, తాంసి మండలంలోని బండల్‌ నాగాపూర్‌, ఆదిలాబాద్‌ మండలం పొచ్చర, జైనథ్‌, బేల, బోథ్‌ మండలం పొచ్చర, గుడిహత్నూర్‌ మండలం కొలారి ప్రాంతాల్లో గోదాములు నిర్మించారు. రైతులు తమ ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని తరువాత అమ్ముకునేలా ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. నిల్వ చేసిన పంట ఉత్పత్తిపై 75 శాతం, లేదా రూ.2 లక్షల గరిష్ఠ పరిమితికి లోబడి రుణం పొందవచ్ఛు ఈ పథకం కింద తీసుకునే రుణాలకు మొదటి 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆరు నెలల వరకు గోదాములో నిల్వ ఉంచుకోవచ్ఛు కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. గోదాములు ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉపయోగంలోకి రావడం లేదు. రైతు బంధు పథకంపై రైతులకు ఆశించిన రీతిలో ఉపయోగపడటం లేదు. ఈ పథకం రైతుల కోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న విషయం చాలా మందికి తెలియదు. మార్కెట్‌లోని ఉద్యోగులు, తమకు అనుగుణంగా ఉన్న బడా రైతుల ముసుగులో ఉన్న వ్యాపారులకు ఉపయోగపడుతోంది. అధికారులు గోదాముల ఉపయోగంపై రైతులకు కనీసం అవగాహన కల్పించడం లేదు. 2014-15, 2015-16 ఏ ఒక్క రైతు కూడా పంట ఉత్పత్తులను గోదాములో నిల్వ చేసుకోలేదు.దీన్నిబట్టి ఈ పథకం అమలు తీరుపై మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. 2016-17లో మాత్రమే 20 మంది రైతులు పండించిన సోయా పంటను రైతుబంధు పథకం ద్వారా గోదాములో నిల్వ చేసి రూ.20 లక్షల వరకు రుణం తీసుకున్నారు.

Related Posts