ఈ నెల పది నుంచి దేశవ్యాఫ్త అందోళన
శ్రీకాళహస్తి అక్టోబరు 3,
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అక్టోబరు 10వ తేదీ నుంచి ఐదు వామపక్ష పార్టీలతో కలిసి దేశవ్యాప్త ఆందోళన సిద్దమని సీపీఐ రాష్ర్టకార్యదర్శి నారాయణ
అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో పరిపాలన నిరంకుశత్వంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోని మాజీ టిడిపి ఎంపీ సుజనా చౌదరి ఇళ్ళపై సీబీఐ
దాడులు చేశారు. చేయించింది. ఈ బీజేపీ నాయకులే. ఇప్పుడు ఆ ఉసే లేదన్నారు. ముందు అవినీతి పరులు. బిజేపి పార్టీలోకి చేరిన తరువాత నీతిపరులైపోయారా అని
చురకలంటించారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన పాలన వ్యతిరేక ధోరణిలో ఉందని కక్ష్య సాదింపు చర్యలుగా మాత్రమే ఉందన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులు రి టేండర్
పేరిట టేండర్ లు ఇవ్వడం ఎంత వరకు సమంజసంమని ప్రశ్నించారు. పాత కాంట్రాక్టుకు ప్రభుత్వం తరపు ఇతర ఏకాంట్రాక్టు పనులు ఇవ్వకుండా ఆపగలరా అని ప్రశ్నించారు. అదే
విధంగా మీడియాపై అంక్షలు విధించడాన్ని తప్పుబట్టినారు. ఛానళ్ల ప్రసారాలు నిలుపుదల చేయడం కక్షసాధింపు చర్య. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం
అన్నారు.