YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మార్కెట్ ఛైర్మన్లలో సగం మహిళలకే

మార్కెట్ ఛైర్మన్లలో సగం మహిళలకే

 మార్కెట్ ఛైర్మన్లలో సగం మహిళలకే
దళారీ వ్యవస్థ కనిపించకూడదు
సమీక్షా భేటీలో సీఎం జగన్
అమరావతి అక్టోబరు 3,
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ ల చైర్మన్ పదవులు,  *కమిటీల్లో కూడా సగం మహిళలకే కేటాయించాలని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  గురువారం అయన 

మార్కెటింగ్, సహకార శాఖలపై 
సమీక్ష నిర్వహించారు.  దరల స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్ బోర్డుల, సహకార రంగం పటిష్టతపైనా సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు 

కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, రెండు శాఖల అధికారులుహాజరయ్యారు. రైతులు పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
ఆరునెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి
కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలి. అక్టోబరు చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డు ఏర్పాడాలని అయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న 

గోడౌన్లు, కోల్డ్ స్టోరేలపై సమగ్ర పరిశీలన, అవసరాలమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు. 
మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న అగ్రికల్చర్ మార్కెట్ 

కమిటీలు, అగ్రివాచ్తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో సీఎం నిర్ణయం, దీనిపై ప్రతిపాదనలు  అధికారులు సీఎంకు వివరించారు. 
వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ వి«ధులుగా ఉండాలని 

ముఖ్యమంత్రి దిశానిర్దేశం
నిపుణులను ఇందులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అన్నారు. 
పప్పు ధాన్యాల కొనుగోళ్ల కేంద్రాలపై ఆరాతీసారు. 85 రైతు బజార్లలో రూ.25 లకే కిలో ఉల్లిపాయలు విక్రయించామన్న అధికారులు 660 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు 

ఇచ్చామన్నవివరించారు. రూ. 32 లకే కిలో ఉల్లి ధరను అదుపు చేయగలిగామని,  మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.  రాష్ట్రంలో ఇప్పుడు 

సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని అధికారులను సీఎం ఆరా తీసారు. సరిపడా నిల్వలు ఉన్నాయని,  టమోటా రైతులను కూడా ఆదుకున్నామని అధికారులు అన్నారు. 
రాయలసీమ ప్రాంతాన్ని మిల్లెట్స్ హబ్గా మార్చాలన్న సీఎం, 9 నెలలపాటు గ్రీన్ కవర్ఉండేలా చూడాలని అదేశించారు. మిల్లెట్స్ బోర్డులో కూడా నిపుణులకు పెద్దపీట వేయాలి. 

వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాససింగ్ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలని అన్నారు. మిల్సెట్స్ బోర్డు విధివిధానాలపై సమావేశంలో చర్చ, అక్టోబరు చివరినాటికి ఏర్పాటుకు చర్యలు 

తీసుకోవాలి సూచించారు. అరటి, చీనీ, మామిడి, కమలాపండ్ల, బొప్పాయి సహా ఏ పంట విషయంలోనైనా దళారులు లేకుండా చూడండి. 6 నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, 

అధికారులు దీన్ని సవాల్గా తీసుకోవాలి. మార్కెటింగ్లో మనం అనుసరించే విధానాలు రైతుల ప్రయోజనమే లక్ష్యం కావాలని సీఎం అన్నారు. 
గోడౌన్లు, కోల్డ్ స్టోరీజేలపై చర్చ
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేలపై సమగ్ర పరిశీలన జరగాలని  సీఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న అవసరాలు, వాటిని తీర్చేలా గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై 

కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలి. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం కూడా ఎన్నికోల్డ్స్టోరేజీలు ఉండాలన్నదానిపై కార్యాచరణ సిద్ధంచేయాలని అన్నారు.

Related Posts