దుమ్ము రేపిన ఓపెనర్స్ మయాంక్ డబుల్ సెంచరీ
విశాఖపట్టణం, అక్టోబరు 3,
భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కెరీర్‌లో తొలి ద్విశతకం నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్ (215: 371 బంతుల్లో 23x4, 6x6).. కెరీర్‌లో వేగంగా డబుల్ సెంచరీ మార్క్‌ని అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు.భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా డబుల్ సెంచరీ మార్క్‌ని అందుకున్న ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. కరుణ్ నాయర్ కెరీర్‌లో మూడో టెస్టు ఇన్నింగ్స్‌లోనే ద్విశతకాన్ని సాధించగా.. వినోద్ కాంబ్లి 4వ ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయిని అందుకున్నాడు. ఇక తాజాగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ సాధించగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సరిగ్గా 8వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్క్‌ని అందుకున్నాడు. దీంతో.. మూడో స్థానంలో గవాస్కర్ సరసన రికార్డ్‌లో మయాంక్ నిలిచాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆరేసి ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (5), గవాస్కర్ (4), చతేశ్వర్ పుజారా (3) టాప్-6లో ఉన్నారు. మొత్తంగా.. భారత్ తరఫున 52వ డబుల్ సెంచరీ నమోదైంది.స్వల్ప వ్యవధిలో రోహిత్, పుజారా ఔటయినప్పటికీ కెప్టెన్ కోహ్లితో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనంతరం కోహ్లి ముత్తుసామి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తదనంతరం టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. మయాంక్ సైతం ఎల్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఇండియా 120.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.