YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మావోయిస్టు లొంగుబాటు

మావోయిస్టు లొంగుబాటు

మావోయిస్టు లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
 భద్రాచలం 39వ బెటాలియన్ సిఆర్ పిఎఫ్ ఏ ఎస్పి రాజేష్ చంద్ర   ముందు మావోయిస్టు సవలం యడమయ్య అలియాస్  రామారావు  లొంగిపోయాడు. రామారావు  స్వగ్రామం మంగళ గూడ, కిష్టారం తాలూకా సుక్మా జిల్లా, చత్తీస్  ఘడ్ రాష్ట్రం, 2003 వ సంవత్సరం లో మావోయిస్టు పార్టీలో చేరిన రామారావు మూడు సంవత్సరాల పాటు సీఎన్ఎంగ్రూప్ లో పని చేసాడు. ఆ తర్వాత 2005లో ఆలెం భాస్కర్ అలియాస్ సుకుదేవ్ నేతృత్వంలో చర్ల ఎస్జీఎస్  లో డిప్యూటీ కమాండర్ గా చేరాడు. ఈ గ్రూపులో  వున్నప్పుడు  303 రైఫిల్ ను ఉపయోగించాడు. ఆ తర్వాత 2007లో 2వ  ప్లాటున్ సి సెక్షన్ యొక్క డిప్యూటీ కమాండర్ గా 2వ సీఆర్సీకి బదిలీ అయ్యాడు. ఈ గ్రూప్ లో ఇతను ఎన్సాస్  రైఫిల్ను ఉపయోగించాడు. 2008లో ఇతను సి- సెక్షన్ కమాండర్ గా పదోన్నతి పొందాడు. ఈ సందర్భంలో అతను ఎస్ ఎల్ ఆర్  రైఫిల్ ను ఉపయోగించాడు. ఇతను చతిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన సుక్మా , బీజాపూర్ లోను ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ లలో పోలీసుల పై జరిగిన పన్నెండు  దాడులలో  పాల్గొన్నాడు.  2006 లో కుంట వద్ద గల ఉర్ఫాల్ మెట్ట సమీపం లో సీఆర్పీఎఫ్  బలగం పై దాడి,  చింతల్ నార్  కు చెందిన ముక్రామ్ సమీపంలో సీఆర్పిఎఫ్  బలగాలపై దాడి,  2008 జిగురుగొండ పిఎస్ పరిధి లోని దారెల్లి సమీపంలో ఎస్టీఎఫ్ దళాల పై దాడి, 2008 కుంట లోని బండ సమీపంలో ఎస్టీఎఫ్ దళాలపై జరిగిన దాడి పాల్గొన్నాడు.  2009లో ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ వద్దగల సి ఆర్ పి ఎఫ్ శిబిరం పై దాడి ,  2010 చింతల్ నార్ కు చెందిన ముక్రామ్ సమీపంలో సిఆర్పిఎఫ్ బలగాల పై దాడి,  2012 కోరపుట్ లోని  సిఆర్పిఎఫ్ క్యాంపు పై దాడి, 2013 లో ఉసూర్ పిఎస్ పరిధిలో గుంజపర్తి సమీపంలో  సిజి పోలీసులపై దాడి, 2013లో చర్ల పీఎస్ పరిధిలో కుర్నపల్లి సమీపంలో స్పెషల్ పార్టీ పోలీసులపై దాడి,   2014లో పుట్టపాడు  సమీపంలో పోలీసుల పై దాడి,  2015లో గొళ్లపల్లి పీఎస్ పరిధిలో బట్టిగూడెం సమీపంలో సిజి పోలీసుల పై దాడి,  2015లో చింతగుప్ప పీఎస్ పరిధిలోని తెమల్ వాయి సమీపంలో సీఆర్పిఎఫ్ పై జరిగిన దాడుల్లో పాల్గొన్నాడు. 2016 సంవత్సరం ముగింపులో మంచి జీవితం గడపాలని, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని, జనజీవన స్రవంతిలో కలవాలనే కోరిక తో దళం వదిలిపెట్టి తన గ్రామానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Related Posts