YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2024 అడుగులు ప్రారంభించారే..

2024 అడుగులు ప్రారంభించారే..

2024 అడుగులు ప్రారంభించారే...
విజయవాడ, అక్టోబరు 4,
వైసీపీకి రాజకీయం తెలియదని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనని తాజా ఎన్నికలు రుజువు చేశాయి. సామాన్య జనానికి చేరేలా బాబు వైఫల్యాలను చాటి చెప్పి మరీ అధికారంలోకి వచ్చారు జగన్. ఇపుడు జగన్ ముఖ్యమంత్రి మళ్ళీ 2024లో జరిగే ఎన్నికల్లో జనం ముందుకు వెళ్ళాలంటే జగన్ కి తన ప్రభుత్వం పాలన గురించి చెప్పుకోవడమే అతి ముఖ్యం. విపక్ష టీడీపీని విమర్శించి ఓట్లు రాబట్టాలంటే అది కుదిరే వ్యవహారం కాదు. దాంతో జగన్ ఇప్పటి నుంచి దానికి తగిన కార్యాచరణ సిధ్ధం చేసుకుంటున్నారంటున్నారు. పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు. అంతే కాదు, అధికారానికి కూడా గట్టి కొమ్మలు. ఈ సంగతి జగన్ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో.జగన్ నాలుగు నెలల కాలంలో ఏం చేశారని అడుగుతున్న విపక్ష తెలుగుదేశానికి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద పొలిటికల్ స్కెచ్ వేశారన్నది అర్ధమవుతుంది. గ్రామాలను తన వైపు తిప్పుకోవడానికి గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ని జగన్ తెరమీదకు తెచ్చారన్నది టీడీపీకి తెలిసేసరికి లక్షలాది ఉద్యోగులు అపాయింట్మెంట్ లెటర్స్ తీసేసుకున్నారు. వీరు కాకుండా గ్రామ వాలంటీర్లు రెండున్నర లక్షల మంది కూడా ప్రతి యాభై కుటుంబాలను నిరంతరం కనిపెట్టుకుని ఉంటారు. ఏపీలో ప్రభుత్వ కార్యక్రమాలను వారే జనం వద్దకు తీసుకెళ్తారు. ప్రభుత్వం అంటే జగన్ కాబట్టి నేరుగా వైసీపీ గురించే వారు ప్రచారం చేస్తారు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మంచి చేస్తున్న ప్రభుత్వం గురించి చెబుతున్నామని అంటారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసి జనంలో చైతన్యం చేస్తున్నామని అంటారు. కానీ అండర్ కరెంట్ గా వైసీపీ అజెండా జనంలోకి వెళ్ళిపోతుంది.లేట్ గా ఈ వాస్తవం తెలుసుకున్న టీడీపీ ఇపుడు ఏకంగా గ్రామ వాలంటీర్ల మీద బురద జల్లే కార్యక్రమానికి తెర తీసింది. గ్రామ వాలంటీర్లను నమ్మడానికి లేదని, ఆడవారు ఒంటరిగా ఇంట్లో ఉంటే వారు వస్తే ఏమైనా ఉందా అంటూ కొత్తరకం అనుమానాలను ముందుకుతెస్తున్నారు. అంటే వాలంటీర్లను అసలు నమ్మవద్దు అంటూ జనంలోకి పంపించడం ద్వారా వారికి ముందే గేట్లు మూసేలా చేస్తున్నారు. అయితే టీడీపీ ఎంత చెప్పినా ప్రభుత్వ పధకాలు వారి చేతుల్లోనే ఉంటాయి. వాటి కోసం అయినా వాలంటీర్లను ప్రజలు అనుసరించాల్సిందే. వారి కోసం వేచిఉండాల్సిందే. అయిదు వందల వరకూ ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయం ద్వారా అమలు చేస్తామని జగన్ చెబుతున్నారు. అంటే ఓ విధంగా ప్రభుత్వమే గడప దగ్గరకు వచ్చేసినట్లు. ఇది టీడీపీ హయాంలోఆర్భాటంగా పెట్టుకున్న ప్రజల వద్దకు పాలన కాదు, అంతకు వేయింతల అసలైన పాలన. అందుకే చంద్రబాబు టీం బెదురుతోంది. మరి జగన్ బలం పల్లెపట్టులో పెరగకుండా టీడీపీ ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.ాత్ర 

Related Posts