YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్ర దిశగా పవన్ అడుగులు

పాదయాత్ర దిశగా పవన్ అడుగులు

పాదయాత్ర దిశగా పవన్ అడుగులు
హైద్రాబాద్, అక్టోబరు 4,
పాదయాత్ర అంటే అధికారే పీఠానికి దగ్గరదారి అని బలంగా రుజువు అయిపోయింది. పాదాలను నమ్ముకున్న వారు ఎవరూ నష్టపోలేదని గత రెండు దశాబ్దాలలో అనేక సంఘటనలు రుజువు చేశాయి. నిజానికి పాదయాత్ర కాన్సెప్ట్ పాత‌దే అయినా దాన్ని రాజకీయాల్లోకి జొప్పించి అధికారాన్ని ఎలా సంపాదించవచ్చో తెలియచెప్పిన వారుగా దివంగత వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును మొదటిగా గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులతో పాటుగా తాను ఒకరిగా ఉన్న స్థాయి నుంచి శిఖరాయమానంగా ఏపీ రాజకీయాల్లో అవతరించే వరకూ పాదయాత్ర వైఎస్సార్ కి బాగా ఉపయోగపడిందని చెప్పాలి. 2003లో వేసవి మండుటెండల్లో పాదయాత్ర రెండున్నర నెలల పాటు చేసిన వైఎస్సార్ ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి మంచి మెజారిటీ తెప్పించి పోటీ లేకుండా ముఖ్యమంత్రి పీఠం పట్టేశారు.ఇక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో మగ్గుతూ అధికారం దక్కక అల్లాడుతున్న చంద్రబాబుకు కూడా దారి చూపించింది కూడా పాదయాత్రే. 2012 లో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి 2013 ప్రధమార్ధం వరకూ కొనసాగించారు. ఆ తరువాత ఏపీ విడిపోయిన నేపధ్యంలో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పాద మహిమను విస్తృతం చేశారు. సరిగ్గా ఇదే టైంలో జగన్ జైల్లో ఉండడంతో ఆయన సోదరి వైఎస్ షర్మిల పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర చేసి 2014 ఎన్నికల్లో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా మారడానికి ఎంతో కారణమైంది. ఉమ్మడి ఏపీలో షర్మిల పాదయాత్రకు మంచి గుర్తింపు రావడమే కాదు, ఆమెను గట్టి మహిళా నేతగా కూడా తయారుచేసిందని చెప్పాలి.ఇక వైఎస్ జగన్ పాదయాత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆయన సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు. దాదాపుగా 14 నెలల పాటు, 3700 కిలోమీటర్లు నడిచి ఇడుపులపాయను ఇచ్చాపురాన్ని కలిపేశారు. జగన్ తొమ్మిదేళ్ల రాజకీయం ఒక ఎత్తు, ఒక్క పాదయాత్ర మరో ఎత్తు. జగన్ అంటే ఏంటో జనాలకు రుజువు చేసిన అతి పెద్ద కార్యక్రమం ప్రజాసంకల్ప పాదయాత్ర. ఏపీలో మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకుని నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రిగా జగన్ కొలువుతీరారంటే అది పాదయాత్ర మహిమేనని చెప్పాలి.ఇపుడు ఏపీలో మరో పాదయాత్రకు రంగం సిధ్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. చేసేది ఎవరంటే జనసేనాని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన కూడా పార్టీని బతికించుకోవడానికి, తన నాయకత్వాన్ని రుజువు చేసుకొవడానికి పాదయాత్రకు సిధ్ధం కావడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారుట. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పాదయాత్ర చేయాలని పవన్ అనుకుంటున్నట్లుగా జనసేన వర్గాల సమాచారం. వన్ మాన్ ఆర్మీగా ఉన్న జనసేనలో పవన్ పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా పాదయాత్ర సెంటిమెంట్

Related Posts